PM Security Lapse: మోదీ- రాష్ట్రపతి భేటీ.. పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై తీవ్ర ఆందోళన
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. పంజాబ్ పర్యటనలో ప్రధానికి ఎదురైన భద్రతా లోపాలపై చర్చించారు.
పంజాబ్ పర్యటనలో ప్రధానికి ఎదురైన భద్రతా లోపాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రధాని మోదీతో రాష్ట్రపతి భేటీ అయ్యారు. ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వెంకయ్య ఆందోళన..
ఈ వ్యవహారంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు వెంకయ్య.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని కోరింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అయితే భద్రతా వైఫల్యాల వల్లే ప్రధాని పర్యటన రద్దయిందనే వాదనను పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఖండించారు. అసలు ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో వస్తున్నారనే సమాచారమే తమకు అందలేదన్నారు. ప్రధాని పర్యటన రద్దు కావడంపై చింతిస్తున్నామన్నారు.
Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

