ఫ్లైట్‌లో పని చేయని ఏసీ, 5 గంటల పాటు ప్రయాణికుల నరకయాతన - ఊపిరాడక ఇబ్బందులు
Mumbai Mauritius flight: ముంబయి మారిషస్ ఫ్లైట్‌లో ఏసీ పని చేయక ప్రయాణికులు 5 గంటల పాటు నరకం చూశారు.
Air Mauritius Flight: ఈ మధ్య కాలంలో ఎయిర్‌లైన్స్‌లో టెక్నికల్ ఫెయిల్యూర్స్ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌లో ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ముంబయి నుంచి మారిషస్‌కి వెళ్తున్న Air Mauritius ఫ్లైట్‌లో ఇలాంటి సమస్యే వచ్చింది. ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్‌లో లోపం వల్ల దాదాపు 5 గంటల పాటు ప్రయాణికులు నరకం చూశారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రయాణికుల్లో చిన్నారులూ ఉన్నారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. వాళ్లలో 78 ఏళ్ల వృద్ధుడు ఊపిరాడక చాలా సేపు ఇబ్బంది పడ్డాడు. ఇంజిన్‌లో సమస్య కారణంగా దాదాపు 5 గంటల పాటు అలాగే నిలిచిపోయింది. ఇవాళ తెల్లవారుజామున (ఫిబ్రవరి 24) 4.30గంటలకే ఫ్లైట్ బయల్దేరాల్సి ఉంది. కానీ టెక్నికల్ గ్లిచ్ వల్ల అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. దిగిపోవాలన్నా సిబ్బంది అంగీకరించలేదని ప్రయాణికులు చెప్పారు. అన్ని గంటలు గడిచినా ఆ సమస్యను సరి చేయలేకపోయింది సిబ్బంది. ఫలితంగా...ఆ ఫ్లైట్‌ని క్యాన్సిల్ చేసింది. దీనిపై ప్యాసింజర్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Several infants and a 78-year-old passenger on Mumbai to Mauritius flight MK749 of Air Mauritius developed breathing problems as ACs onboard the flight were not working. The flight was to depart at 4:30 am today. Passengers boarded at 3.45 am onwards but the aircraft developed an… pic.twitter.com/urXcyApGBE
— ANI (@ANI) February 24, 2024
కెనడాకి చెందిన ఓ టూరిస్ట్ థాయ్‌లాండ్‌లో ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచి అందరినీ టెన్షన్ పెట్టాడు. Thai Airways ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. డోర్ తెరవడం వల్ల విమానంలో నుంచి దిగే స్లైడ్ ఒక్కసారిగా ఓపెన్ అయింది. ఫలితంగా టేకాఫ్‌కి తీవ్ర అంతరాయం కలిగింది. అప్రమత్తమైన అధికారులు ఆ టూరిస్ట్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరవాత పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే...నిందితుడి తరపున లాయర్ తన క్లైంట్ అమాయకుడని, ఏదో తెలియక చేశాడని వాదించాడు. ఏదో ధ్యాసలో ఈ పని చేశాడని చెప్పాడు. "ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచినట్టు నా క్లైంట్ అంగీకరించాడు. కానీ ఆ పని తను కావాలని చేయలేదు. ఉన్నట్టుండి ఏదో ధ్యాసలో పడిపోయాడు. ఆ భ్రమలోనే డోర్ తెరిచాడు" అని వెల్లడించాడు. ఈ ఘటనపై Chiang Mai ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం స్పందించింది. డోర్ తెరిచిన వెంటనే విమానాన్ని మళ్లీ టర్మినల్‌కి తీసుకొచ్చినట్టు వివరించింది. సేఫ్‌టీ ఇన్‌స్పెక్షన్ జరిపించిన తరవాత టేకాఫ్ అయిందని తెలిపారు. ఈ ఘటన కారణంగా దాదాపు 12 విమానాలు ఆలస్యంగా నడిచాయి.అయితే...ప్రయాణికులు మాత్రం దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా సముద్రంపై ప్రయాణించే సమయంలో డోర్ తెరిచి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో ఊహించుకోండి అంటూ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యంపై మండి పడ్డారు.