News
News
X

MP Kanimozhi: ఖుష్భూ, నమితపై డీఎంకే నేత అసభ్యకర వ్యాఖ్యలు- కనిమొళి క్షమాపణలు!

MP Kanimozhi: భాజపాలో ఉన్న సీనియర్ హీరోయిన్లు ఖుష్భూ, నమితపై డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

FOLLOW US: 

MP Kanimozhi: భాజపాలో చేరిన హీరోయిన్స్ ఖుష్భూ, నమిత, గౌతమి, గాయత్రి రఘురామన్‌లపై డీఎంకే నేత సాధైయ్ సాధిక్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై డీఎంకే నాయకురాలు కనిమొళి.. బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

అనుచిత వ్యాఖ్యలు

ఆర్కే నగర్‌లో ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో డీఎంకే నేత సాధైయ్ సాధిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. భాజపాలో ఉన్న సీనియర్‌ నటీమణులు ఖుష్బూ, నమితా, గౌతమి, గాయత్రి రఘురామన్‌లు 'ఐటమ్‌'లు అంటూ వ్యాఖ్యానించారు.

" తమిళనాడులో భాజపా బలపడుతుందని ఖుష్బూ చెబుతున్నారు. అమిత్‌షా తలపై వెంట్రుకలైనా మొలుస్తాయోమో కానీ తమిళనాడులో కమలం మాత్రం వికసించదు. డీఎంకేను నాశనం చేసి భాజపాని బలోపేతం చేసేందుకు ఈ ఐటమ్స్ ఉపయోగపడతారా? ఇది వారి వల్ల కాదు. "
-                                                            సాధైయ్ సాధిక్, డీఎంకే నేత

News Reels

అంతటితో ఆగని సాధిక్.. ఖుష్భూపై రాయలేని భాషలో అసభ్య పదజాలాన్ని వినియోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై భాజపా నేత ఖుష్భూ తీవ్రంగా స్పందించారు. ఇదేనా సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ మోడల్ పాలన అంటూ విమర్శించారు.

" పురుషులు స్త్రీలను దుర్భాషలాడటం.. అది వారి పెంపకం, వారు పెరిగిన విషపూరిత వాతావరణాన్ని అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ పురుషులు.. స్త్రీ గర్భాన్ని అవమానిస్తారు. అలాంటి పురుషులు  తాము కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. ఇదేనా సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ నమూనా పాలన.                                   "
- ఖుష్భూ, భాజపా నేత

క్షమాపణలు

ఖుష్భూ చేసిన ట్వీట్‌పై డీఎంకే నేత కనిమొళి స్పందించారు. ఖుష్బూకి క్షమాపణలు తెలియజేశారు.

" మహిళలను కించపరుస్తూ మా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ పార్టీ వారైనా వాటిని సహించలేం. మా నాయకుడు సీఎం స్టాలిన్‌ గానీ, పార్టీ అధిష్టానం కానీ ఇలాంటి చర్యలను ఉపేక్షించదు.                                                  "
- కనిమొళి, డీఎంకే నాయకురాలు 

Also Read: Delhi News: రోడ్డుపై చెలరేగిన గొడవ- ముగ్గురిని కారుతో ఢీ కొట్టి డ్రైవర్ పరార్!

Published at : 28 Oct 2022 04:20 PM (IST) Tags: DMK leader Sadiq women actor-turned-BJP leaders Kanimozhi apologizes

సంబంధిత కథనాలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Hyderabad: డ్రగ్స్ విక్రయిస్తున్న 2 అంతర్రాష్ట్ర ముఠాల ఆట కట్టించిన హైదరాబాద్ పోలీసులు

Hyderabad: డ్రగ్స్ విక్రయిస్తున్న 2 అంతర్రాష్ట్ర ముఠాల ఆట కట్టించిన హైదరాబాద్ పోలీసులు

బైక్‌పై వేగంగా వెళ్లాడని వ్యక్తి దారుణహత్య, 12 ఏళ్ల తరువాత 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష

బైక్‌పై వేగంగా వెళ్లాడని వ్యక్తి దారుణహత్య, 12 ఏళ్ల తరువాత 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

Tirumala Update: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే

ABP Desam Top 10, 30 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 30 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

30 నెలల్లో బందరు పోర్ట్ సిద్ధం చేస్తాం: మాజీ మంత్రి పేర్ని నాని

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

Jai Bhim Sequel: త్వరలో ‘జై భీమ్’కు సీక్వెల్? మరో కొత్త కేసుతో రానున్నారా?

TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

TRS Fire On Sharimila :  భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !

అదిరిపోయే సాంగ్‌తో మురిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీ మౌని రాయ్

అదిరిపోయే సాంగ్‌తో మురిపిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ బ్యూటీ మౌని రాయ్