Delhi News: రోడ్డుపై చెలరేగిన గొడవ- ముగ్గురిని కారుతో ఢీ కొట్టి డ్రైవర్ పరార్!
Delhi News: దిల్లీలో బైకర్, కారు డ్రైవర్ మధ్య గొడవ చెలరేగింది. దీంతో కారు డ్రైవర్.. కొందరిని వాహనంతో ఢీ కొట్టాడు.
Delhi News: దిల్లీలో దారుణ ఘటన జరిగింది. కారు డ్రైవర్, బైకర్‌కు మధ్య జరిగిన గొడవ పెద్దదయింది. దీంతో ఆగ్రహించిన కారు డ్రైవర్.. బైకర్‌తో పాటు మరికొందిరిపైకి వాహనాన్ని పోనిచ్చాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | Delhi: A car ran over people in Alipur area on Oct 26 following an argument with a bike rider. 3 people injured & admitted to a hospital. Accused driver, Nitin Maan has been arrested, case registered under sec of IPC incl 307 (attempt to murder). Probe on.
— ANI (@ANI) October 28, 2022
(Source:CCTV) pic.twitter.com/523eyA2v8C
ఇదీ జరిగింది
అలీపుర్ ప్రాంతంలో ఈ నెల 26న ఘటన జరిగింది. ఒక ఇరుకు వీధిలోకి కారు వచ్చింది. అంతలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కారును క్రాస్ చేశాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. స్థానికులు జోక్యం చేసుకుని వారిద్దరికీ సర్ది చెప్పారు.
కానీ ఆగ్రహంతో ఊగిపోయిన కారు డ్రైవర్.. గొడవ పడిన బైకర్‌తో పాటు మరి కొందరిని కారుతో ఢీ కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దర్యాప్తు
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కారు నంబర్ ఆధారంగా నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే సీసీటీవీలో రికార్డయిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Died After Drinking Tea: యూపీలో విషాదం- టీ తాగి ఐదుగురు మృతి!