Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి
Money Laundering Case: మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందు విచారణ కోసం నటి నోరా ఫతేహి హాజరైంది.
Money Laundering Case: బాలీవుడ్ నటి నోరా ఫతేహి.. సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్లదోపిడి కేసులో తన స్టేట్‌మెంట్ ఇవ్వడానికి విచారణకు ఈడీ ముందు హాజరయింది. ఇంతక ముందు కూడా నోరా ఈ కేసులో విచారణను ఎదుర్కొంది.
#NoraFatehi reached the #ED office in Delhi. 200 crore fraud and the case is related to Sukesh Chandrasekhar. #Viralvideo pic.twitter.com/bjF8BbAnFZ
— Hazel Jason (@HazelJason2) December 2, 2022
ఈ కేసులో నిందితుడైన చంద్రశేఖర్‌తో నోరాకు ఉన్న సంబంధాలపై అధికారులు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. ఈడీ తన అనుబంధ ఛార్జిషీట్‌లో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా చేర్చింది. అందులోనే నోరా ఫతేహి స్టేట్‌మెంట్ గురించి కూడా జత చేసింది. అయితే ఈడీ తాను దాఖలు చేసిన మొదటి ఛార్జిషీట్‌లో ఆమె గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.
పింకీ ఇరానీ
నవంబర్ 30న పింకీ ఇరానీ అనే చంద్రశేఖర్‌కు సంబంధించిన వ్యక్తిని 3 రోజుల కస్టడీకి అప్పగించారు. బాలీవుడ్ నటులను కలిసేలా చేయడం, మోసగించిన సొమ్మును ఇతర ప్రాంతాలకు తరలించడం వంటి వాటిలో ఇరానీ ప్రముఖ పాత్ర వహించారు అని కోర్టు తెలిపింది. మోసగించిన సొమ్ముతో జాక్వెలిన్, నోరా ఫతేహిలకు ఖరీదైన, విలాసవంతమైన గిఫ్టులు, కార్లు ఇచ్చాడని సుకేశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
జాక్వెలిన్‌కు బెయిల్
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఇటీవల ఊరట లభించింది. దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జాక్వెలిన్‌కు బెయిల్ మంజూరు చేసింది. సుఖేశ్ చంద్రశేఖర్ కు సంబంధించిన కేసులో ఆమెతో సహా మరికొందరు సినీ, వ్యాాపార ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సుఖేష్ చంద్రశేఖర్ వ్యవహారం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖులను బెదిరించడంతో పాటు 200 కోట్ల రూపాయలు మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. దీంతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉండటంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. సుకేష్‌తో జాక్వెలిన్ గతంలో డేటింగ్ చేసిందని, సన్నిహితంగా ఉందని బాలీవుడ్‌లో టాక్. ఆ టైం లో సుకేశ్, నటి జాక్వెలిన్‌కు ఖరీదైన బహుమతులు ఇచ్చాడని, ఆమె కుటుంబ సభ్యులకు కూడా బహుమతులు ఇచ్చేవాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడితో సంబంధాలు కలిగి ఉండటం, కోట్ల విలువ చేసే గిఫ్టులు తీసుకోవడంతో ఈ కేసులో ఈడీ అధికారులు ఆమెను కూడా విచారిస్తున్నారు.
Also Read: NOTA Temple Gujarat: ఎన్నికల వేళ గుజరాత్‌లో వెలసిన 'నోటా' ఆలయం!