Delhi Farmars : సమస్యల పరిష్కారానికి కమిటీ.. ఆందోళన విరమించి ఇంటికెళ్లాలని రైతులకు కేంద్రం పిలుపు !
రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారు. ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళనలు విరమించాలని కేంద్రమంత్రి కోరారు.
మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ రైతులు ఆందోళన విరమించలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిశీలించడానికి ఓ ప్రత్యేకమైన కమిటీని నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఓ అధికారిక ప్రకటన చేశారు. పంట మార్పడి, కనీస మద్దతు ధరల, జీరో బడ్జెట్ , రైతుల సంక్షేమం వంటి అంశాలపై చర్చించి ఈ కమిటీ సిఫార్సులు చేస్తుంది. ఈ కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. 29వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి రోజునే మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్న బిల్లులను ప్రవేశ పెడతారు.
#WATCH | As far as cases registered during the protest are concerned, it comes under the jurisdiction of state govts & they will take a decision. State govts will decide on the issue of compensation too, as per their state policy: Union Agriculture Minister NS Tomar pic.twitter.com/gQyWbUvx2F
— ANI (@ANI) November 27, 2021
Also Read : బుందేల్‌ఖండ్‌లో పట్టు సాధిస్తే నిలబడినట్లే .. యూపీలో ప్రియాంక గాంధీ ప్లాన్ !
ఉద్యమ సమయంలో రైతులపై నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే కేసులు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని.. ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయని నరేంద్రసింగ్ తోమన్ ప్రకటించారు. అలాగే మరణించిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయని తోమర్ తెలిపారు. ఆయా రాష్ట్రాల పాలసీల ప్రకారం నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉందన్నారు.
Also Read : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వేలాది మంది రైతులు వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో గత ఏడాది నవంబర్ 26 నుంచి ఢిల్లీలోని ఘాజీపూర్, సింగు, తిక్రీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిన్నామొన్నటి వరకూ పట్టించుకోలేదు. అయితే హఠాత్తుగా చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించారు. అయినా రైతులు తమ నిరసననను ఆపలేదు.
Also Read : మరోసారి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత... ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
నిరసనను విరమించి తమ ఇళ్లకు తిరిగి రావాలని తోమర్ రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదని.. రైతులు తమ ఆందోళనను విరమించి ఇంటికి వెళ్లాలని నేను కోరుతున్నానన్నారు.
Also Read: Vladimir Putin India Visit: డిసెంబర్‌లో భారత పర్యటనకు పుతిన్.. మోదీతో కీలక చర్చ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి