Anti-Hijab Protests Iran: వాళ్ల ధైర్యం చూస్తుంటే గర్వంగా ఉంది, వారి ఆకాంక్ష నెరవేరుతుంది - యాంటీ హిజాబ్‌పై ఒబామా దంపతులు
Anti-Hijab Protests Iran: ఇరాన్‌లో యాంటీ హిజాబ్ ఉద్యమంపై ఒబామా దంపతులు స్పందించారు.
Anti-Hijab Protests Iran:
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా..
ఇరాన్‌లో మహిళలంతా యాంటీ హిజాబ్ ఉద్యమాన్ని రోజురోజుకీ తీవ్రతరం చేస్తున్నారు. హిజాబ్ ధరించలేదని ఓ యువతిని అరెస్ట్ చేయడం, ఆమె కస్టడీలోనే మృతి చెందడం అక్కడి మహిళలకు ఆగ్రహం కలిగించింది. ఆ ఘటన జరిగినప్పటి నుంచి అక్కడి మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. బహిరంగంగానే హిజాబ్‌ను తొలగించి నినదిస్తున్నారు. మొదట్లో కేవలం ఒకటి రెండు చోట్ల మాత్రమే కనిపించిన ఈ వ్యతిరేకత...క్రమంగా దేశమంతా వ్యాపించింది. సోషల్ మీడియాలోనూ ఇరాన్ మహిళలకు మద్దతు లభిస్తోంది. పలువురు ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ఆమె సతీమణి మిషెల్లే కూడా దీనిపై మాట్లాడారు. ఇరానియన్ మహిళలకు వాళ్లకు మద్దతుగా నిలబడ్డారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా...సోషల్ మీడియా వేదికగా ఓ స్టేట్‌మెంట్ కూడా విడుదల చేశారు. "ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సంవ సందర్భంగా...ఇరానియన్ మహిళలకు మేము అండగా నిలబడ తామని మాటిస్తున్నాం. ఈ ఆందోళనలతో మహిళలందరికీ స్ఫూర్తినిస్తున్న వారికీ మా మద్దతు ఉంటుంది" అని వెల్లడించారు. "వాళ్లు అడిగే హక్కులు ఆమోదయోగ్యమైనవి. సమానత్వం, తమకు తాముగా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవటం, తమ గుర్తింపు కోసం పోరాడటం, ఎలాంటి వేధింపులు, హింస ఎదుర్కోకుండా బతకాలనుకోవటం. ఇవే వాళ్లు అడిగేది" అని ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు బరాక్ ఒబామా, మిషెల్లే. "చేదు గతాన్ని మర్చిపోయి తమ భవిష్యత్ అందంగా ఉండాలని పోరాడుతున్న ఇరానియన్ మహిళలను చూస్తుంటే గర్వంగా ఉంది. త్వరలోనే వాళ్లు తమ హక్కుల్ని పోరాడి సాధించుకుంటారని ఆశిస్తున్నాం" అని అన్నారు.
On this International Day of the Girl, we stand in solidarity with the courageous Iranian women and girls who have inspired the world through their ongoing protests. pic.twitter.com/71WfEdMt9A
— Barack Obama (@BarackObama) October 11, 2022
80 నగరాల్లో నిరసనలు..
ఇరాన్‌లో 80 నగరాల్లో యాంటీ హిజాబ్ నిరసనలు కొనసాగుతున్నాయి. యువతులు, మహిళలు రోడ్లపైకి వచ్చిపెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ నిరనసల్లో 75 మంది చనిపోయినట్టు అక్కడి రిపోర్ట్‌లు కొన్ని చెబుతున్నాయి. ఇప్పుడు మరో యువతి కూడా మృతి చెందింది. అంతకు ముందు ఆ యువతి వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఈ ప్రొటెస్ట్‌లో పాల్గొనే ముందు ఆమె...హిజాబ్ తీసేసి తన జుట్టుని ముడి వేసుకుంది. ఆ తరవాత నిరసనల్లోకి వెళ్లింది. ఇప్పుడీ యువతినే దుండుగులు కాల్చి చంపారు. 20 ఏళ్ల హదీస్ నజఫీని
పొత్తి కడుపులో, మెడపై, గుండెపై కాల్పులు జరిపారు. ఆమె అంత్యక్రియల వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. సమాధి పక్కనే మహిళలు ఆమె ఫోటో పట్టుకుని కన్నీరు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె శరీరంలో మొత్తం 6 బుల్లెట్లు గుర్తించారు.
జుట్టు కత్తిరించుకుని..
నిరసనలతోనే మహిళలు ఆగిపోలేదు. తమ జుట్టుని కత్తిరించుకుని, హిజాబ్‌లను కాల్చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్‌లో ఇప్పుడిదో ఉద్యమంలా మారింది. ఇరాన్ మహిళలంతా తమ జుట్టుని కట్ చేసుకుని, తరవాత హిజాబ్‌లను మంటల్లో తగలబెడుతున్న వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇరాన్‌లో ఇస్లామిక్ లా ప్రకారం...ఏడేళ్లు పైబడిన మహిళలెవరైనా జుట్టుని హిజాబ్‌తో కవర్ చేసుకోవాలి. పొడవాటి, వదులుగా ఉండే దుస్తులే ధరించాలి. ఈ ఏడాది జులై5న అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ప్రత్యేకించి మహిళల వేషధారణపై ఇంకా ఆంక్షలు విధించారు. హిజాబ్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. దీనిపైనే...మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు.
Also Read: Viral Video: పానీపూరీ ఎలా ఉంది గజేంద్ర! ఎంచక్కా లాగించేసింది!