Mallojula Venugopal Rao: మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
Maoist Party Members surrender | మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కొందరు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోగా, అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

Maoist Party Latest News | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను దాదా లొంగిపోయారు. మరో ముగ్గురు కీలక నేతలు సహా మొత్తం 60 మందితో కలిసి లొంగిపోయినట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ వెల్లడించారు. సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట లొంగుబాటును చూపించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సోమవారం సాయంత్రం మల్లోజుల వేణుగోపాల్ బృందం పోలీసులకు వద్దకు వెళ్లి సరెండర్ కావడం మావోయిస్టు పార్టీలో కలకలం రేపుతోంది. విజయ్ శర్మ మాట్లాడుతూ.. నక్సలిజం అంతం కావాలని బస్తర్ ప్రజలు కోరుకుంటున్నారు. మావోయిస్టు అగ్ర నేతలు సైతం ఆయుధాలు వీడి, జన జీవన స్రవంతి కలవాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే తల్లోజుల వేణుగోపాల్, కొందరు మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులు ఉండరా.. ?
ఛత్తీస్ గఢ్ సహా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్ట రహత దేశంగా భారత్ ను మార్చుతామని హోం మంత్రి అమిత్ షా పలుమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో శాంతి చర్చలకు వెళ్లాలని సెప్టెంబర్ నెలలో మావోయిస్టు పార్టీ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఆయుధాలు వదిలేసి, శాంతి చర్చలకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, డీజీపీ అంతా సహకరించాలని మల్లోజుల వేణుగోపాల్ ఆ ప్రకటనలో కోరడం తెలిసిందే. మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమి సైతం మల్లోజుల ఈ లేఖకు మద్దతిచ్చింది. కానీ హిడ్మా, దేవ్ జీ లనుంచి వ్యతిరేకత వచ్చింది. ఉద్యమం నుంచి తప్పుకోవాలనుకుంటున్నందుకు, పార్టీలో జరిగిన తప్పిదాలకు పొలిటిబ్యూరో సభ్యుడిగా బాధ్యత వహించి క్షమాపణ చెబుతున్నానని మరో లేఖ సైతం విడుదల చేశాడు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం సరికాదని తెలుసు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలు వీడి, శాంతి చర్చలు జరపడే కరెక్ట్ అని పేర్కొన్నాడు. మల్లోజుల ప్రకటన మావోయిస్టు పార్టీలో మంట పెట్టింది. కొందరు మల్లోజుల నిర్ణయానికి మద్దతు తెలపగా, హిడ్మా లాంటి మరికొందరు ప్రముఖ మావోయిస్టులు పోరాటానికే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మల్లోజుల వేణుగోపాల్ మరో 60 మంది మావోయిస్టులతో పాటు వెళ్లి గడ్చిరోలి పోలీసుల ఎదుటలొంగిపోయారు.






















