Superwood: స్టీల్ కన్నా బలమైనది,తేలికైనది .. సూపర్ ఉడ్ వచ్చేసింది !
InventWood Launches Superwood: ఉడ్‌కు ప్రత్యామ్నాయంగా ఇప్పటి వరకూ స్టీల్ వాడుతున్నారు. ఇక నుంచి స్టీల్ కు ప్రత్యామ్నాయంగా ఉడ్ వాడతారు. అలాంటి సూపర్ ఉడ్ ను అమెరికా కంపెనీ కనిపెట్టింది.

Superwood: Stronger Lighter Than Steel: మేరీలాండ్‌కు చెందిన అమెరికన్ కంపెనీ InventWood, కొత్త రకమైన చెక్కను 'సూపర్‌వుడ్' (Superwood) అనే పేరుతో ప్రవేశపెట్టింది. ఈ సూపర్ ఉడ్ బలం-బరువు నిష్పత్తిలో స్టీల్ కంటే 10 రెట్లు బలమైనది, 6 రెట్లు తేలికైనదిగా ఇన్వెంట్ ఉడ్ ప్రకటించింది. ప్రసిద్ధ మెటీరియల్స్ సైంటిస్ట్ లియాంగ్‌బింగ్ హూ (Liangbing Hu) నేతృత్వంలో ఈ సూపర్ ఉడ్‌ని అభివృద్ధి చేశారు. ఇప్పటికే వాణిజ్య ప్రొడక్ట్‌గా అందుబాటులోకి వచ్చింది. సాధారణ చెక్క కంటే 20 రెట్లు బలమైనది, డెంట్ రెసిస్టెన్స్ 10 రెట్లు ఎక్కువగా ఉండే ఈ సూపర్‌వుడ్, నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని కంపెనీ సీఇఓ అలెక్స్ లావ్ (Alex Lau) ప్రకటించారు.
10 సంవత్సరాల రీసెర్చ్ ఫలితం
10 సంవత్సరాలకు మించి యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెటీరియల్స్ ఇన్నోవేషన్ సెంటర్‌లో ఈ చెక్కపై పరిశోధన చేస్తున్నారు. చెక్కకు రంగు, బలాన్ని ఇచ్చే లిగ్నిన్ (lignin) భాగాన్ని తొలగించి, ప్లాంట్ ఫైబర్ ప్రధాన కాంపోనెంట్ సెల్యులోజ్ తో బలోపేతం చేయాలని ప్రతిపాదించారు. సెల్యులోజ్ అత్యంత సాధారణ బయోపాలిమర్‌లలో ఒకటి. పరిశోధనల్లో మొదటి సారి 2017లో బ్రేక్‌త్రూ వచ్చింది. సాధారణ చెక్కను కెమికల్ ట్రీట్‌మెంట్‌తో బలోపేతం చేసి, నేచురల్ సెల్యులోజ్‌ను కలిపారు. 'నేచర్' జర్నల్‌లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం, ఈ చెక్క మెటల్ స్ట్రక్చర్స్, అలాయ్‌ల కంటే బలం-బరువు నిష్పత్తి ఎక్కువగా ఉంది. ఆ తర్వాత హూ 140కి పైగా పేటెంట్లు ఫైల్ చేశారు. కెమికల్, ప్రాక్టికల్ స్టాండ్‌పాయింట్ నుంచి ఇది చెక్కే. టెస్టింగ్‌లో చెక్కలా బిహేవ్ అవుతుంది, అన్ని అంశాల్లో సాధారణ చెక్క కంటే బలమైనది. అని సైంటిస్టులు ప్రకటిచారు.
ప్రొడక్షన్ ప్రాసెస్ సింపుల్ కానీ ఎఫెక్టివ్
సూపర్‌వుడ్ తయారీ సులభమైనది. మొదట చెక్కను నీరు, స్పెషల్ కెమికల్స్‌తో కలిపిన బాత్‌లో బాయిల్ చేస్తారు. తర్వాత హాట్ ప్రెసింగ్‌తో సెల్యులర్ లెవెల్‌లో కంప్రెస్ చేస్తారు. ఇది పోరస్ స్ట్రక్చర్‌ను డెన్స్ చేస్తుంది. ఈ ప్రాసెస్ చెక్కను మోలిక్యూలర్ లెవెల్‌లో మార్చి, బలాన్ని పెంచుతుంది. స్టీల్ కంటే 10 రెట్లు బలమైన స్ట్రెంగ్త్-టు-వెయిట్ రేషియో, సాధారణ చెక్క కంటే 20 రెట్లు బలమైనది. స్టీల్ కంటే 6 రెట్లు తేలిక, నిర్మాణాలను 4 రెట్లు తేలికపరుస్తుంది. 10 రెట్లు ఎక్కువ, ఫంగస్, పెస్ట్‌లకు నేచురల్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. హై రేటింగ్ ఫైర్ రెసిస్టెన్స్ కలది.
నిర్మాణ రంగంలో గేమ్ చేంజర్ అవుతుందని అంచనా !
ఈ ఉత్పత్తి నిర్మాణ రంగంలో సరికత్త సంచలనం అవుతుందని కంపెనీ భావిస్తోంది. పదేళ్ల పాటు రీసెర్చ్ చేసి సాధించిన ఈ సూపర్ ఉడ్ ప్రయోగాలన్నీ విజయవంతమయ్యాయి. వాణిజ్య ఉత్పత్తి కూడా ప్రారంభమైనందున.. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఈ సూపర్ ఉడ్ .. నిర్మాణ రంగంలో కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.





















