Viral News: శరవేగంగా విస్తరిస్తున్న కొత్త వైరస్ - స్కూళ్లన్నీ మూసివేత - ఆస్పత్రుల్లో 6 వేల మంది విద్యార్థులు !
Mystery Disease: మలేషియాలో కోవిడ్ తరహా మిస్టరీ వైరస్ బాధితులు పెరిగిపోతున్నారు. దీంతో స్కూళ్లన్నీ మూసేశారు.

Malaysia Covid or mystery: మలేషియాలో విద్యార్థుల్లో అసాధారణంగా వ్యాప్తి చెందుతున్న మిస్టరీ వ్యాధి కారణంగా దాదాపు 6,000 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ పరిస్థితి భయభ్రాంతులకు దారితీసింది. అధికారులు తాజాగా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని ప్రతిపాదించారు. కొవిడ్-19 కాదా లేక మరో మిస్టరీ వైరస్సా అన్నదానిపై వైద్య నిపుణులు పరిశోధన చేస్తున్నారు.
మలేషియా రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఈ వైరస్ గుర్తించారు. తాజా నివేదికల ప్రకారం, గత వారంలో మాత్రమే 5,800 మంది విద్యార్థులు, 200 మంది ఉపాధ్యాయులు ఈ వ్యాధికి గురయ్యారు. మొదట లేఖన్, సెలంగూర్ ప్రావిన్స్‌లో ఈ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఇప్పుడు ఇది ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
🇲🇾Malaysia: "COVID or mystery disease? Malaysia shuts schools after nearly 6,000 students infected"
— Denis - The COVID info guy - (@BigBadDenis) October 14, 2025
"Schools urged to follow preventive steps like mask use and avoiding large gatherings. Officials haven’t said how many schools have been closed so far"https://t.co/ei0QKqq69I pic.twitter.com/MlUphYCDIV
ఇది కొవిడ్-19తో సమానమైన లక్షణాలు చూపిస్తోంది. కానీ టెస్టులు నెగెటివ్ వస్తున్నాయి. ఈ వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చని, లేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చని డాక్టర్లు అనుమానిస్తున్నారు.
ఇన్ఫెక్ట్ అయిన విద్యార్థుల్లో కనిపించే ప్రధాన లక్షణాలు:
- జ్వరం (అధిక ఉష్ణోగ్రత)
- దగ్గు, గొంతు నొప్పి
- శ్వాస తీసుకోవడం కష్టం కావడం
- అలసట
- కొందరిలో చర్మపై దద్దుర్లు, కళ్లలో దురద
ఈ లక్షణాలు కొవిడ్‌తో దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, PCR టెస్టులు, యాంటిజెన్ టెస్టులు అన్నీ నెగెటివ్ వస్తున్నాయి. "ఇది కొత్త వేరియంట్ కావచ్చు లేక ఇతర రెస్పిరేటరీ వైరస్ కావచ్చు," అని WHO నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యాధి ప్రధానంగా 10-18 సంవత్సరాల విద్యార్థుల్లో కనిపిస్తోంది.
They still don’t get it — COVID is way more contagious than the flu. It spreads like wildfire, and pretending otherwise doesn’t change the facts. 🔥😷 https://t.co/d9Uiaexucs
— CryptoVision (@NewXvg) October 14, 2025
మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఆర్డర్ జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లు, హాస్టళ్లు 14 రోజుల పాటు మూసివేయాలి. "పిల్లల ఆరోగ్యం ప్రధానం. ఈ రోజుల్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలి అని ప్రభుత్వం స్పష్టం చేశారు. కోవిడ్ తరహా వైరస్అయి ఉంటుందని.. ఎలా వ్యాపిస్తుందన్నదానిపై స్పష్టత లేదు. అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.





















