Viral video: పెళ్లితో లైఫ్ సెటిల్ - నమ్మలేరా - మరి 21 కోట్లు మండపంలోనే మామ ఇచ్చేసినా నమ్మలేరా?
Marwari family : రాజస్తాన్ లో ఓ పెళ్లి కొడుక్కి.. పిల్లనిచ్చిన మామ ఊహించనంత ధనం ఇచ్చాడు. దాంతో ఆ పెళ్లి కొడుకు జాతకం మారిపోయిందని అందరూ సెటైర్లు వేస్తున్నారు.

Marwari family gives Rs 21 crore mayra in wedding: పెళ్లి అంటే లైఫ్ సెటిల్ అని చాలా మంది అంటారు. కానీ పెళ్లి కొడుక్కి మాత్రం సెటిల్‌మెంట్ కాదు అసలు స్టార్ట్ అనే క్లారిటీ ఉంటుంది. కానీ ఈ పెళ్లి కొడుక్కి మాత్రం అంతా లైఫ్ సెటిల్ అయిపోయింది.
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని ఝాడేలి గ్రామంలో జరిగిన ఒక వివాహంలో పొట్లియా కుటుంబం రూ. 21.11 కోట్ల విలువైన మైరా (Mayra)ను ఇచ్చింది. ఝాడేలి గ్రామానికి చెందిన పొట్లియా కుటుంబంలోని శ్రేయాంశ్ వివాహంలో జరిగింది. వివాహం డెహ్ గ్రామంలోని బిజెపి మాజీ రాష్ట్ర మంత్రి జగ్‌బీర్ ఛాబా కుటుంబంతో జరిగింది. పొట్లియా కుటుంబం పెళ్లి సందర్భంగా రూ. 1.51 కోట్లు నగదు, 1 కిలో బంగారం (సుమారు రూ. 70-80 లక్షల విలువ), 15 కిలోల వెండి (సుమారు రూ. 10-12 లక్షల విలువ), 210 బిఘాల భూమి (జోధ్‌పూర్ హైవే సమీపంలో, సుమారు రూ. 15-18 కోట్ల విలువ) , క పెట్రోల్ పంప్ (సుమారు రూ. 1-2 కోట్ల విలువ), అజ్మేర్‌లో ఒక ప్లాట్, ఒక ఫోర్-వీలర్ వాహనం, దుస్తులు, ఇతర వస్తువులు ఇచ్చారు. అలాగే డెహ్ గ్రామంలోని 500 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఒక వెండి నాణెం బహుమతిగా ఇచ్చారు.
మైరా అంటే మన భాషలో కట్నం అనుకోవచ్చు. మైరా అనేది రాజస్థాన్‌లో, ముఖ్యంగా మార్వాడీ సమాజంలో వివాహ సమయంలో అనుసరించే ఒక సాంప్రదాయ ఆచారం. ఈ సంప్రదాయంలో, వధువు లేదా వరుడి తల్లి తరపు కుటుంబం వారి సోదరి లేదా సోదరి పిల్లల కోసం బహుమతులను అందజేస్తారు. ఈ బహుమతులు నగదు, ఆభరణాలు, భూమి, వాహనాలు, లేదా ఇతర విలువైన వస్తువుల రూపంలో ఉంటాయి. ఇది కుటుంబ గౌరవం, ప్రేమ, , ఆర్థిక సహకారాన్ని సూచిస్తుంది. మైరా కట్నం గానే పరిగణిస్తున్నారు. అయినా ఇది సాంప్రదాయంగా వధువు లేదా వరుడి తల్లి తరపు కుటుంబం నుంచి స్వచ్ఛందంగా ఇచ్చే బహుమతిగానే చూస్తారు.
ఈ ఘటన సోషల్ మీడియా వేదికలపై, ముఖ్యంగా Xలో వైరల్ అయింది. ఈ మైరా గురించి పలు పోస్ట్‌లు షేర్ చేశారు.
2 किलो चांदी एक पैट्रोल पंप 210 बीघा जमीन एक प्लॉट एक करोड़ 51 लाख नगद कुल टोटल मिलाकर 15 करोड़ 63 लाख रुपए मायरा चढ़ाया गया
— Jitendra Verma (@jeetusp) May 6, 2025
शादी राजस्थान के एक जाट परिवार में हुई है
क्या इतनी बड़ी रकम दहेज प्रथा कानून के तहत अपराध है कि नहीं pic.twitter.com/8lxgdrhayl
ఈ భారీ మైరా నాగౌర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. స్థానికులు ఈ సంఘటనను ఒక చారిత్రక ఘట్టంగా భావించారు, ఎందుకంటే ఇది జిల్లాలో ఇప్పటివరకు ఇచ్చిన అతిపెద్ద మైరాగా చెప్పుకున్నారు.





















