Mamata Banerjee : కోల్‌కతా డాక్టర్ కేసు సీబీఐ చేతికి వెళ్లడమే అడ్వాంటేజ్ - బీజేపీని ఇరుకున పెడుతున్న మమతా బెనర్జీ
Kolkata Doctor Case : కోల్‌కతా అత్యాచార కేసు విషయంలో రాజకీయంగా బీజేపీని కార్నర్ చేసేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. అపరాజిత పేరుతో చట్టం చేశారు. నిందితుడ్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
Mamata Banerjee politically cornered BJP over the Kolkata Doctor case : కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన డాక్టర్ హత్యాచార ఘటన విషయంలో జరుగుతున్న రాజకీయాల్ని మమతా బెనర్జీ ధాటిగా ఎదుర్కొంటున్నారు. తనపై ముప్పేట దాడి చేస్తున్న బీజేపీపైనే రివర్స్ ఆరోపణలు చేస్తూ.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మమతా బెనర్జీ వ్యూహంతో ఇప్పుడు బీజేపీకి ఎం చెప్పాలో..ఎలా ఎదురుదాడి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. ఇప్పుడు ఆ డాక్టర్ హత్య కేసు సీబీఐ దగ్గరే ఉంది మరి.
వ్యూహాత్మకంగా కేసు సీబీఐకి వెళ్లేలా చేసిన మమతా బెనర్జీ
ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన డాక్టర్ పై అత్యాచారం, హత్య విషయంలో అసలు నిజాల కన్నా బయట జరిగిన ప్రచారమే చాలా ఎక్కువ. ఆ ప్రచారం అంతా దేశ ప్రజల్లో ఆ నేరంపై ఆగ్రహం కలిగేలా చేసింది. నిజానికి ఇప్పటికీ ఏం జరిగిందో తెలియదు. బెంగాల్ ప్రభుత్వం చేతుల్లో ఈ కేసు ఉన్నప్పుడు తీవ్రమైన విమర్శలు వచ్చాయి. నిందితుల్ని కాపాడుతున్నారని..ఏదో దాస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యేవి. అయితే మమతా బెనర్జీ ఈ విషయంలో సీబీఐకి కేసు వెళ్లేలా చేయగలిగారు.మామూలుగా బెంగాల్‌లో సీబీఐకి అనుమతి అనుమతి లేదు. జనరల్ కన్సెంట్ ఇవ్వలేదు. అందుకే కోర్ట ద్వారా సీబీఐ విచారణకు ఆదేశాలు వచ్చేలా వ్యూహాత్మకంగా చేసుకున్నారు. ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వం సీబీఐకే ఇవ్వాలని చెప్పడంతో కేస సీబీఐకి వెళ్లింది. దాంతో మమతా బెనర్జీకి భారం దిగిపోయినట్లయింది.
30 మంది అధికారులను ఉరి తీసిన కిమ్, సరిగ్గా పని చేయలేదని ఈ శిక్ష
కేసు సీబీఐకి వెళ్లినప్పప్పటి నుండి ఎదురుదాడి చేస్తున్న మమతా బెనర్జీ
కేసును సీబీఐ హ్యాండోవర్ చేసుకోవడంతో.. ఇక తప్పంతా కేంద్రానిదేనని వాదిస్తూ.. మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా రోజుకు ఎన్నెన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో వివరిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం స్పందించకపోతే ఎందుకు స్పందించడం లేదని మరోసారి ప్రశ్నించారు. ఆ తర్వాత సీబీఐ నెమ్మదిగా విచారణ చేస్తోందని ఆందోళనలు చేయడం ప్రారంభించారు. కోల్ కతాలో భారీ ర్యాలీ నర్వహించారు. ధర్నాలు, దీక్షలు చేశారు. దానికి కొనసాగింపుగా అపరాజిత పేరుతో ప్రత్యేక చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. అత్యాచారం చేసిన వాళ్లకు ఇన్ స్టంట్‌గా మరణశిక్ష వేసేలా ఆ చట్టం తెచ్చారు. బెంగాల్ లో ప్రస్తుతం ఉన్న భావోద్వేగ పరిస్థితుల్లో బీజేపీ సభ్యులు కూడా ఆ చట్టాన్ని ఆమోదించకతప్పలేదు.
రోడ్ సైడ్ చాయ్ వాలా - స్టైలింగ్‌తోనే సూపర్ స్టార్ అయ్యాడు - ఇప్పుడెంత సంపాదిస్తాడో తెలుసా ?
కౌంటర్ చేయడంలో బీజేపీ కంగారు
సీబీఐ విచారణ ప్రారంభించింది. ఆర్జికర్ ఆస్పత్రి ప్రిన్సిపాల్ ను అరెస్టు చేసింది. కానీ కేసును ఓ లాజికల్ ముగింపునకు తీసుకు రాకపోతే రాజకీయం ఆగదు. మమతా బెనర్జీ అదే చేస్తున్నారు. కేసు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు చేశారు.. ఇప్పుడెందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎలా చూసినా.. ఆర్జీకర్ ఆస్పత్రి ఘటనలోరాజకీయాన్ని మమతా బెనర్జీ తన గుప్పిట్లోకి తెచ్చుకుని బీజేపీని ఇరుకున పెట్టే విషయంలో అనూహ్యమైన రాజకీయం చేశారని అనుకోవచ్చు.