అన్వేషించండి
Advertisement
Mallikarjun Kharge: మేం స్వతంత్రం తెచ్చాం- దేశం కోసం మీరేం చేశారు, ప్రాణాలిచ్చారా?: ఖర్గే
Mallikarjun Kharge: భాజపాపై తాను చేసిన 'శునకం' వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. భాజపాపై విమర్శల డోసు పెంచారు. భారత స్వాతంత్య్రోద్యమంలో భాజపా పాత్ర ఏమీ లేదని తాను చేసిన వ్యాఖ్యలను ఖర్గే సమర్థించుకున్నారు. ఈ మేరకు రాజ్యసభలో మంగళవారం ఖర్గే వ్యాఖ్యానించారు.
" నేను పార్లమెంటులో ఈ వ్యాఖ్యలు చేశాను. ఇప్పుడు కూడా చెప్పగలను. భారత స్వతంత్రోద్యమంలో భాజపా పాత్ర ఏమీ లేదు. నేను మాట్లాడిన మాటలు చాలా మందికి కష్టంగా ఉంటాయి. ఇక్కడ విచిత్రంగా క్షమాపణలు చెప్పాల్సిన వారు.. స్వతంత్రం తెచ్చిన పార్టీని క్షమాపణలు అడుగుతున్నారు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. మీలో ఎవరు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు? "
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
అంతకుముందు
ఈ సోమవారం మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. భాజపాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Mallikarjun Kharge:
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) December 19, 2022
"Indira Gandhi & Rajiv Gandhi sacrificed their life for this country. Did even a DOG die from your (BJP) side ?"pic.twitter.com/SthN9IH96X
" మేము ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చాం. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ఈ దేశ ఐక్యమత్యం కోసం ప్రాణాలు ఇచ్చారు. మా పార్టీ నేతలు ప్రాణలిచ్చారు. మీరు ఎం చేసారు? మీ ఇంట్లో ఉన్న ఒక్క కుక్క అయిన ప్రాణాలు ఇచ్చిందా? లేదు కదా.. ఎవరన్న ప్రాణ త్యాగం చేశారా? లేదు కదా. "
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
ఖర్గే వ్యాఖ్యలను పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లోద్ జోషి ఖండించారు. ఇప్పుడు నడుస్తున్నది ఇటాలియన్ కాంగ్రెస్ అని ఖర్గే కేవలం రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడని విమర్శించారు.
" రాజస్థాన్‌లో మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇప్పుడు నడుస్తున్నది ఇటాలియన్ కాంగ్రెస్. ఆయన (ఖర్గే) ఓ రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ అని అంతా అంటున్నారు. వారి ఆలోచనావిధానం అలాగే ఉంటుంది. వారు వీర్ సావర్కర్, స్మ్రతి ఇరానీ గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నేను మల్లికార్జున్ ఖర్గే గారికి ఇంగిత జ్ఞానం ఉందనే అనుకున్నాను.. కానీ ఈ రోజుతో లేదు అని నిరూపించారు. "
- ప్రహ్లాద్ జోషి, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి
Also Read: Halal Meat: ఇక 'హలాల్' వంతు! అసలేంటి ఈ కొత్త వివాదం, ఎందుకీ రచ్చ?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement