Malaysia Landslide: కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి- 50 మంది గల్లంతు
Malaysia Landslide: మలేసియాలో కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గల్లంతయ్యారు.
Malaysia Landslide: మలేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని కౌలాలంపూర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 9 మంది వరకు మృతి చెందారు. 50 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది.
A landslide killed at least nine people as they slept at a campsite in Malaysia, with search teams scouring thick mud and downed trees for about two dozen people still missing https://t.co/zUZKDwyhao
— Reuters (@Reuters) December 16, 2022
ఇదీ జరిగింది
కౌలాలంపూర్‌కు సమీపంలోని సెలాంగోర్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఫామ్‌హౌస్‌ను క్యాంప్ సౌకర్యాల కోసం ఏర్పాటు చేశారు. కార్మికులు, అధికారులు క్యాంపులో నిద్రపోతున్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
ప్రమాద సమయంలో మొత్తం 79 మంది క్యాంప్‌లో ఉండగా అందులో 23 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన వారిని కాపాడేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. సమాచారం అందుకన్న వెంటనే భద్రతా దళాలు, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి.
Also Read: Arunachal CM On Tawang Clash: 'ఇది 1962లోని నెహ్రూ పాలన కాదు- ఇప్పుడు మోదీ యుగం'