(Source: ECI/ABP News/ABP Majha)
Arunachal CM On Tawang Clash: 'ఇది 1962లోని నెహ్రూ పాలన కాదు- ఇప్పుడు మోదీ యుగం'
Arunachal CM On Tawang Clash: అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ఘర్షణపై ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Arunachal CM On Tawang Clash: భారత్- చైనా సైనికుల మధ్య తాజాగా జరిగిన ఘర్షణపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ స్పందించారు. ఇది 1962 యుగం కాదని, 2022లో ప్రధాని మోదీ యుగం అని అన్నారు. గురువారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం ఖండూ ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా పట్ల నెహ్రూ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఆయన తప్పుబట్టారు. తవాంగ్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితికి మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కారణమని ఖండూ ఆరోపించారు. సిమ్లా ఒప్పందం తర్వాత తవాంగ్‌ను భారత భూభాగంగా మార్చారని అన్నారు.
ఇదీ జరిగింది
డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి.
ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రకటన చేశారు.
"డిసెంబరు 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో PLA దళాలు చొరబడి.. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. ఈ ఘర్షణలో ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. అయితే మన సైనికులు ఎవరూ చనిపోలేదు. అలానే తీవ్రమైన గాయాలు కాలేదని నేను ఈ సభకు చెప్పాలనుకుంటున్నాను. భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల చైనా సైనికులు తమ సొంత స్థానాలకు వెనుదిరిగారు. ఈ సంఘటన తర్వాత డిసెంబర్ 11న ఆ ప్రాంత స్థానిక కమాండర్.. చైనా స్థానిక కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి ఈ సంఘటన గురించి చర్చించారు. సరిహద్దు వద్ద శాంతిని కొనసాగించాలని భారత్ పిలుపునిచ్చింది. "
Also Read: Rafales Landed In India: చైనా గుండెల్లో గుబులు- భారత్ చేరుకున్న చివరి రఫేల్!