అన్వేషించండి

Rupali Chakankar and Ashok Kharat: కీచకబాబాతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సంబంధాలు - పదవి పోయింది!

Rupali Chakankar:సోషల్ మీడియాలో ఇప్పుడు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రూపాలి చాకంకర్ వైరల్ అవుతున్నారు. దీనికి కారణం ఓ స్వామిజీ. చివరికి ఆమె పదవి కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది.

Rupali Chakankar and Ashok Kharat:   నాసిక్ భోందూ బాబా  అశోక్ ఖరాత్ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.  
అశోక్ ఖరాత్  తనను తాను ఒక ఆధ్యాత్మిక గురువుగా, జ్యోతిష్యుడిగా పరిచయం చేసుకునేవాడు.  కెప్టెన్ అని పిలుచుకునే ఈయన, తన వద్దకు వచ్చే మహిళలకు దైవశక్తులు ప్రసాదిస్తానని నమ్మించి, వారిపై లైంగిక వేధింపులకు ,అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు మూడేళ్ల పాటు ఒక మహిళను బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారానికి ఒడిగట్టాడనే ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇతని వద్ద దొరికిన అశ్లీల వీడియోలు, ఆర్థిక లావాదేవీల చిట్టా మహారాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

 రుపాలీ చాకంకర్ ఎందుకు ఇరుక్కున్నారు? 

ఈ కేసులో ఎన్సీపీ  కి చెందిన కీలక నేత, మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్  రుపాలీ చాకంకర్  పేరు ప్రముఖంగా వినిపించింది. అశోక్ ఖరాత్‌ను ఆమె తన గురువుగా భావించేవారు. దీనికి బలమైన సాక్ష్యంగా ఆమె ఖరాత్ కాళ్లు కడుగుతున్న వీడియోలు, అతడికి గొడుగు పడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మహిళల రక్షణ కోసం పనిచేయాల్సిన కమిషన్ అధిపతి, ఒక రేప్ నిందితుడికి అంతటి గౌరవం ఇవ్వడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.   

 పదవులకు రాజీనామా 

ఈ వివాదం ముదరడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందనే కారణంతో రుపాలీని పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. దీంతో ఆమె మొదట మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్**  పదవికి, ఆ తర్వాత పార్టీలోని  ఎన్సీపీ మహిళా విభాగం అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కేవలం వారం వ్యవధిలోనే ఆమె రెండు కీలక పదవులను కోల్పోవాల్సి వచ్చింది. 

  

 నిర్భయంగా సమర్థించుకున్న రుపాలీ 

రాజీనామా చేసినప్పటికీ, రుపాలీ చాకంకర్ తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ వీడియోలు ఐదేళ్ల క్రితంవని, ఒక గురువుగా ఆయనను గౌరవించానే తప్ప ఆయన చేసే దుశ్చర్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం తానొక మహిళను కాబట్టే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఖరాత్‌తో ఫోటోలు దిగిన 36 మంది ఇతర రాజకీయ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం అశోక్ ఖరాత్ కేసును సిట్  విచారిస్తోంది. రుపాలీ చాకంకర్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఈ విచారణపైనే ఆధారపడి ఉంది. ఆధ్యాత్మిక గురువుల ముసుగులో జరిగే అరాచకాలు మరియు రాజకీయ నేతల అండదండలపై ఈ ఘటన మరోసారి సమాజంలో చర్చకు తెరలేపింది.  

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget