Madras High Court: మంగళసూత్రం తీసేయడం మానసిక క్రూరత్వం- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Madras High Court: ఓ వివాహిత మంగళసూత్రాన్ని తీసెస్తే అది మానసిక క్రూరత్వానికి నిదర్శనమని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
Madras High Court: మంగళసూత్రం ధరించే విషయంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త బతికుండగా భార్య మంగళ సూత్రాన్ని తీసివేయడం మానసిక క్రూరత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది.
ఓ విడాకుల కేసు విచారణలో భాగంగా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వీఎం వేలుమణి, జస్టిస్ ఎస్ సౌంథర్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇదీ కేసు
తమిళనాడు ఈరోడ్‌కు చెందిన శివకుమార్ తనకు విడాకులు ఇవ్వడాన్ని నిరాకరిస్తూ స్థానిక ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ మేరకు 2016 జూన్ 15 నాటి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఆయన ఓ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఈ కేసు విచారణలో భర్త నుంచి విడిపోయే సమయంలో ఆమె తన తాళి గొలుసును తొలగించినట్లు కోర్టు ముందు అంగీకరించింది. దీంతో మన దేశంలో జరిగే వివాహ వేడుకలలో తాళి కట్టడం అనేది ఒక ముఖ్యమైన ఆచారమని కోర్టు పేర్కొంది. ఆయన అప్పీల్‌ను అనుమతించింది.
Also Read: Corona Cases: దేశంలో వరుసగా రెండో రోజూ 20 వేల కేసులు- పెరిగిన మృతుల సంఖ్య
Also Read: Viral Photo : ఎద్దుల భారాన్ని తగ్గించిన ఐడియా - ఇప్పుడిదే సోషల్ మీడియా ట్రెండింగ్!