Sports Calender 2025 Update: చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రపంచకప్ వరకు.. ఈ ఏడాది జరిగే ప్రముఖ స్పోర్ట్స్ ఈవెంట్ల వివరాలు
గతేడాది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన క్రీడలు.. అభిమానులకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చాయి. ఈ ఏడాది కూడా చాలా ప్రతిష్టాత్మక టోర్నీలు జరుగనున్నాయి.
Major Sports Calender 2025: నూతన సంవత్సరం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా 2024కు వీడ్కోలు పలకడంతోపాటు 2025కు స్వాగతం పలికారు. అలాగే ఈ ఏడాది ప్రతిష్టాత్మక టోర్నీలు జరుగనున్నాయి. ఇందులో క్రికెట్ విషయానికొస్తే ఐసీసీ నిర్వహించే రెండు టోర్నీలు ఉన్నాయి. అలాగే ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్ లాంటి టోర్నీలు ఎలాగు ఉంటాయి. ఈక్రమంలో ఈ ఏడాది ముఖ్యమైన టోర్నీలపై అప్పుడే క్రీడాభిమానులు ఒక కన్నేశారు. వచ్చే ఫిబ్రవరిలో పాకిస్థాన్, దుబాయ్ లలో చాంపియన్స్ ట్రోపీ జరుగనుంది. ఇండియాలో ఆడే మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతుండగా, మిగతా జట్ల మ్యాచ్ లు పాక్ లో జరుగనున్నాయి. అలాగే భారత్ లో మహిళా వన్డే ప్రపంచకప్ జరుగుతుంది. దీంతోపాటు ఈ ఏడాది ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఉండనుంది. ఆస్ట్రేలియా పర్యటనకు ఇంగ్లాండ్ ఈ సిరీస్ కోసం బయల్దేరనుంది.అలాగే ఫుట్బాల్ విషయానికొస్తే ఫిఫా క్లబ్ లెవల్ ప్రపంచకప్ నిర్వహించనుంది. ఖోఖో ఆటలో తొలిసారిగా ప్రపంచకప్ జరుగనుంది. ఇక టెన్నిస్ విషయానికొస్తే నాలుగు గ్రాండ్ స్లామ్ లు యథావిధిగా జరుగుతాయి. అలాగే ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్, ఎఫ్1 రేసులు సీజన్ల వారిగా నడుస్తాయి. ఇక నెలలవారిగా ప్రతి నెలలో జరిగే ప్రముఖ టోర్నీలను గురించి తెలుసుకుందాం.
A quick snapshot of the Sports Calendar for 2025.
— Ishan Tanna (@IshanTanna1) January 1, 2025
Which ones are you eagerly awaiting? pic.twitter.com/jcsGgmuFYI
జనవరి: ఆస్ట్రేలియన్ ఓపెన్ (టెన్నిస్), ఖోఖో ప్రపంచకప్, అండర్-19 మహిళా టీ20 ప్రపంచకప్.
ఫిబ్రవరి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ
మార్చి: ప్రపంచ అథ్లెటిక్ రిలే, ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్, ఐపీఎల్,
ఏప్రిల్: ప్రపంచ స్నూకర్ చాంపియన్ షిప్, లండన్ మారథాన్ (అథ్లెటిక్స్)
మే: ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్, ఫ్రెంచ్ ఓపెన్ (టెన్నిస్).
జూన్: ఎన్బీఏ ఫైనల్స్ (బాస్కెట్ బాల్), ఫిఫా క్లబ్ ప్రపంచకప్, ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రి (ఎఫ్1), వింబుల్డన్ (టెన్నిస్)
జూలై: బ్రిటిష్ గ్రాండ్ ప్రి (ఎఫ్1), ఫిడే మహిళా ప్రపంచకప్ (చెస్), ప్రపంచ ఆక్వాటిక్ చాంపియన్షిప్
ఆగస్టు: మహిళా వన్డే ప్రపంచకప్ (క్రికెట్), యూఎస్ ఓపెన్, ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్, డైమండ్ లీగ్ ఫైనల్స్ (అథ్లెటిక్స్), డచ్ గ్రాండ్ ప్రి (ఎఫ్1)
సెప్టెంబర్: ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్, ఇటాలియన్ గ్రాండ్ ప్రి, ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్, ఫిఫా అండర్-20 ప్రపంచకప్ (ఫుట్ బాల్), మహిళా క్రికెట్ ప్రపంచ కప్
అక్టోబర్: ప్రపంచ వెయిట్ లిప్టింగ్ చాంపియన్షిప్, బీడబ్ల్యూఎఫ్ జూనియర్ చాంపియన్షిప్ (బ్యాడ్మింటన్), యూఎస్ గ్రాండ్ ప్రి (ఎఫ్1), ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ చాంపియన్షిప్
నవంబర్: ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్, ప్రపంచ రైఫిల్, పిస్టోల్ చాంపియన్షిప్, సయ్యదో మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ (బ్యాడ్మింటన్), ఖతార్ గ్రాండ్ ప్రి (ఎఫ్1)
డిసెంబర్: ఎఫ్ఐహెఛ్ హాకీ జూనియర్ ప్రపంచకప్, అబుధాబి గ్రాండ్ ప్రి (ఎఫ్1), బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్.
Also Read: Bumrah Record: 'బుమ్రా'స్త్రం.. అత్యధిక ఐసీసీ పాయింట్లను సాధించిన బౌలర్ గా రికార్డు.. కపిల్, కుంబ్లే, బేడీల వల్ల కాని రికార్డును కొల్లగొట్టిన స్పీడ్ స్టర్