Viral Photo : ఎద్దుల భారాన్ని తగ్గించిన ఐడియా - ఇప్పుడిదే సోషల్ మీడియా ట్రెండింగ్!
ఎద్దుల బండికి రెండు టైర్లు ఉంటాయనే సంగతే మనకు తెలుసు. మూడో చక్రం గురించి అసలు ఆలోచనే లేదు. కానీ కొంత మంది ఎద్దుల భారాన్ని తగ్గించడానికి ఆ ఆలోచన చేశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
Rolling sport fitted on a bullock cart : బండెనక బండి కట్టి అని మనలో పాడుకోని వారు ఉండరు. ఇప్పటికీ గ్రామాల్లో ఎద్దుల బండ్లే రవాణాలో కీలకం. ఎద్దులు అంత భారం తమ మెడపై ఎలా మోస్తున్నాయో అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే అనాదిగా అంతే ఉంది కాబట్టి కొత్తగా ఏమీ చేయలేమని ఊరుకున్నారు. అయితే అందరూ అలా ఊరుకోలేరుగా.. కొంత మంది యువకులు వినూత్న ఆలోచన చేశారు. ఎద్దుల భారాన్ని తగ్గించడానికి మూడో చక్రం అమర్చారు. ఇప్పుడు ఎద్దుల బండి ఎలా ఉందో మీరే చూడండి.
To avoid load pressure on the shoulders of the bulls, this farmer added extra wheel on the front side of his bullock cart. This is great thinking.....great work....... pic.twitter.com/6GoA8fMBUt
— Ramandeep Singh Mann (@ramanmann1974) July 14, 2022
ఈ ఐడియా చాలా మందిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేయగానే అలా వైరల్ అయిపోయింది. అయితే ఈ క్రియేషన్ ఎవరు చేశారో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ఎవరికి వారు ఇతరులకు క్రెడిట్ ఇవ్వడంతో ఈ కన్ఫ్యజన్ ప్రారంభమయింది. ముందుగా ఓ ఐఏఎస్ అధికారి ట్వీట్ చేసారు.
बैलों का लोड कम करने के लिए बैलगाड़ी पर लगाया गया रोलिंग स्पोर्ट.
— Awanish Sharan (@AwanishSharan) July 14, 2022
फ़ोटो: साभार pic.twitter.com/icjwYkd0Ko
Great work❤️
— Photographer (@Bidar_yuva) July 14, 2022
To avoid load pressure on bulls this farmer added extra wheel front side bullock cart. pic.twitter.com/ifjrMK5R28
కొంతమంది ఆదిలాబాద్‌లో ఔత్సాహిక యువకులు దీన్ని తయారుచేశారని చెబుతూంటే.. మరికొందరు మాత్రం మహారాష్ట్రకు చెందినవారు చేశారని అంటున్నారు.
Not from Telangana this is from Islampur Sangli District Maharashtra
— Vishwajit (@garadvishwajit) July 14, 2022
తెలుగుప్రజలు కూడా చాలా మంది ఈ బండి ఐడియాను అభినందిస్తున్నారు.
మూగ జీవాలపై ఎడ్ల బండి భారాన్ని తగ్గించేందుకు ఔత్సాహికులు కొత్త తరహాలో ఉపాయం ఆలోచించారు.ఎడ్ల యొక్క వెన్నుపై పడే భారం నుంచి ఉపశమనం కలిగే విధంగా అదనపు ముందు భాగంలో చక్రాన్ని అమర్చారు.దీనివల్ల ఎడ్లపై ఏమాత్రం భారం ఉండదు. కేవలం బండిని తేలికగా ముందుకు తీసుకెళ్తాయి.ఇది మంచి ఇన్నోవేషన్.👌 pic.twitter.com/HezQGRtE9G
— Murthy Journalist (@murthyscribe) July 14, 2022