కాంగ్రెస్‌కి కమల్ నాథ్ షాక్ ఇవ్వనున్నారా? బీజేపీలో చేరతారంటూ ఊహాగానాలు
Kamal Nath: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Kamal Nath to Join BJP: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ భారీ షాక్ తగిలే అవకాశాలున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో కీలక నేతలంతా కాంగ్రెస్‌కి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనూ అదే రిపీట్ కానుంది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌తో పాటు ఆయన కొడుకు నకుల్ కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వాళ్లిద్దరూ బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన అయితే ఏమీ రాలేదు. కానీ..ఇప్పటికే మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఈ వార్తలు అలజడి సృష్టిస్తున్నాయి. తండ్రికొడుకులు ఇద్దరూ ఢిల్లీకి ఒకేసారి వెళ్లడం ఈ పుకార్లను మరింత బలపరిచింది. పైగా...కమల్ నాథ్ కొడుకు తన ట్విటర్ బయోలో కాంగ్రెస్ అనే పేరుని తొలగించారు. ఇది కూడా అనమానాల్ని పెంచింది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో కొంత మంది కీలక నేతలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. మాజీ ఎమ్మెల్యే దినేష్ అహిర్‌వర్‌తో పాటు మరో ముఖ్య నేత ఫిబ్రవరి 12న బీజేపీలో చేరారు. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ లాంటి నేత పార్టీని వీడతారన్న వార్తలు సంచలనం అవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. నెహ్రూ, గాంధీ హయాం నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోతున్నారంటే ఆ పుకార్లను ఎలా నమ్మమంటారు అని ప్రశ్నించారు. అలాంటి ఆలోచనే మానుకోవాలని స్పష్టం చేశారు.
మరికొంత మంది క్యూ..?
వీరితో పాటు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా సోషల్ మీడియా అకౌంట్స్‌లో కాంగ్రెస్ లోగోని తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరతారా అన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అటు బీజేపీ నేతలు కూడా హింట్ ఇస్తున్నారు. తమ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని మధ్యప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ వీడీ శర్మ స్పష్టం చేశారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ నేతల్ని అడ్డుకుందని, ఈ విషయంలో చాలా మంది అసహనంగా ఉన్నారని వెల్లడించారు. అలాంటి వాళ్లంతా బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. కొంత మంది సీనియర్ నేతల్ని కూడా ఆ పార్టీ అవమానిస్తోందని విమర్శించారు.
కూటమి సంగతేంటి..?
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా (I.N.D.I.A.) కూటమికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే నితీశ్ కుమార్(Nithsh Kumar) జారిపోగా...దీదీ కూటమిపై విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇప్పుడు తాజా కూటమి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ బయటకు వెళ్లింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ చీఫ్ ఫారుక్ అబ్దుల్లా (Farooq Abdullah) ప్రకటించారు. అంటే భవిష్యత్ లో తిరిగి ఎన్డీఏలో చేరనున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు అత్యంత నమ్మకమైన భాగస్వామి చేయిజారిపోవడంతో..ఇక మిగిలిన కూటమి సభ్యులు ఏమాత్రం కలిసికట్టుగా ఉంటారన్నది ప్రశ్నార్థకమే.ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎన్నికల ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జమ్ము, కశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అలియన్స్ నుంచి బయటకు వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో తిరిగి ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఫారుక్ అబ్దుల్లా ప్రకటించారు.
Also Read: బల పరీక్షలో భారీ మద్దతుతో నెగ్గిన ఆప్ సర్కార్, ప్రధానికి సవాల్ విసిరిన కేజ్రీవాల్