Viral Video: దేవుడు కాపాడాలనుకుంటే.. ఇలాగే జరుగుతుందట.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్.. వీడియోపై మీరూ ఓ లుక్కేస్తారా!
బుసలు కొడుతున్న కోబ్రా కాటు నుంచి ఓ బాలుడు సెకన్ల వ్యవధిలో తప్పించుకున్నాడు. అసలేం జరిగిందో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఒక్కోసారి మన కళ్ల ముందు జరిగిన సంఘటనలు మనల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. కొన్నిసార్లు చూసిన సన్నివేశాన్ని అర్థం చేసుకోవడానికి మళ్లీ మళ్లీ వీక్షిస్తుంటాం. తాజాగా అలాంటి సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ బాలుడు ప్రమాదకర కోబ్రా కాటు నుంచి సెకన్ల వ్యవధిలో తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతీయ జనతా పార్టీ నేత హితానంద శర్మ ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ఆ వీడియో గమనిస్తే.. ఓ బాలుడు తన స్మార్ట్ ఫోన్‌తో కాలక్షేపం చేస్తుంటాడు. అతడు ఫోన్ స్క్రీన్ చూస్తూనే కిరాణ షాపులోనికి వచ్చాడు. టేబుల్ మీద నడుం వాల్చుదామని అనుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు అతడు సెక్షన్ల వ్యవధిలో అక్కడి నుంచి లేచి పరిగెత్తాడు. మరుసటి సెకన్లో జరిగిన సీన్ చూసిన వీక్షకులు షాకవుతున్నారు.
Also Read: తల్లి పాట వింటూ ఈ పిల్లాడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే మైండ్ బ్లోయింగే!
जाको राखे साईंया मार सके ना कोय !
— हितानंद Hitanand (@HitanandSharma) September 10, 2021
मध्यप्रदेश के रायसेन जिले का यह वीडियो जिसमे चूहे और साँप की दौड़ में बालक बाल बाल बचा। pic.twitter.com/HGoaXXOgg0
బాలుడు పక్కకు జరిగిన వెంటనే ఓ ఎలుక సందు లోంచి బయటకు రావడం, దాని వెనుక నాగుపాము రావడం వీడియోలో కనిపించింది. ఎలుకకు వేటాడుతూ వచ్చిన నాగుపాము ఆ బాలుడు అక్కడే ఉన్నట్లయితే అతడ్ని కాటు వేసేది. అయితే చివరి క్షణంలో ఏదో శబ్దం వస్తుందని అతడు అక్కడి నుంచి పక్కకు జరిగి పరిగెత్తాడు. లేదంటే నాగుపాము కాటుకు బాలుడి ప్రాణాల మీదకి వచ్చేది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఎలుక మరియు పాము రేసులో చిన్నారి తృటిలో తప్పించుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని రాయ్‌సెన్ జిల్లాలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 6న ఈ ఘటన జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. అయితే భగవంతుడు రక్షించాలనుకున్న ప్రాణానికి ఏ ప్రమాదం వాటిల్లదని బీజేపీ నేత హితానంద శర్మ కామెంట్ చేశారు.
Also Read: పాముతో పరాచకాలు.. రాఖీ కట్టీ ఆశీర్వదించాడు.. తర్వాత ప్రాణాలే పోయాయి..
బీజేపీ నేత పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి ప్రయత్నం చేసినా అదృష్టవంతుడ్ని ఎవరూ ఏమీ చేయలేరని.. అలాగే దురదృష్టవంతుడిని ఏం చేసినా కాపాడటం ఎవరి తరం కాదని నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.