By: ABP Desam | Updated at : 14 Jan 2022 11:32 AM (IST)
22 ఏళ్ల తర్వాత చోరీ సొత్తు రికవరీ
ఒకప్పటి దరిద్రం ఇప్పటి అదృష్టం కావొచ్చు. ఒకప్పుడు పోయిందే అని బాధపడ్డారు.. కానీ ఇప్పుడు పోయినందుకు సంతోషపడుతున్నారు. కష్టాలన్నీ తీర్చేస్తోందని ఆనందపడుతున్నారు. ఎందుకంటే అప్పుడు పోయిన సొత్తు ఇప్పుడు దొరికింది.. దాని విలువ అమాంతం పెరిగిపోయింది. ఈ లక్కీ ఘటన ముంబైలో కుటుంబానికి అనుభవమైంది. ఈ కథ తెలుసుకోవాలంటే 22 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్లాలి.
Also Read: బావ చెల్లెలితో లవ్‌లో పడ్డ యువతి.. ఇంట్లోంచి పారిపోయి పెళ్లి కూడా.. చివరికి..
22 ఏళ్ల ఏళ్ల క్రితం .. ఓ నిర్మానుష్యమైన రాత్రి ప్రముఖ వ్యాపారిగా పేరు తెచ్చుకున్న అర్జున్ దాస్వాని కుటుంబం ఇంట్లో అరుపులు..కేకలు. దొంగా.. దొంగ అనేది ఆ అరుపుల సారాంశం. కాసేపటికి ఆ అరుపులు సద్దుమణిగాయి. కానీ సొమ్ములు చేస్తే చాలా మిస్సయాయి. దాదాపుగా రూ. పదమూడు లక్షల విలువ చేసే బంగారం కనిపించకుండా పోయింది. దాస్వాని కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో 1999లో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. సొత్తు రికవరీ చేశారు.
అయితే పోలీసులు దొంగల్ని పట్టుకున్నా.. సొత్తును రికవరీ చేశారు కానీ అది దాస్వాని కుటుంబానికి చేరలేదు. పోలీసుల వద్ద ఉంటే రికవరీ చేసుకోవడం చాలా కష్టం. తమ సొత్తు తమకు ఇప్పించాలని వారు సుదీర్ఘ కాలగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవల న్యాయస్థానం 19 ఏళ్లుగా పోలీసుల ఆధీనంలో ఉన్న ఆ ఆస్తి ఫిర్యాదుదారునికి అందకపోవడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని, సొత్తును షరతులతో కూడిన నిబంధనలకు లోబడి.. తక్షణమే ఆ కుటుంబ సభ్యులకు అందజేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఫిర్యాదుదారుడైన అర్జున్ దాస్వానీ 2007లోనే మరణించడంతో అతని కుమారుడైన రాజు దాస్వాకి పోలీసులు ఈ సొత్తును అందచేశారు.
Also Read: Hyderabad: ఎర్రగడ్డ సంతలో కత్తులు కొని మాజీ భార్యపై ఘాతుకం.. నడిరోడ్డుపైనే కత్తిపోట్లు
ఆ సొత్తును అందుకున్న దాస్వాని కుటుంబసభ్యులకు నోట మాట రాలేదు.ఎందుకంటే అప్పట్లో రూ. పదమడు లక్షల విలువైన సొత్తు.. ఇప్పుడు రూ. ఎనిమిది కోట్లుగా మారింది. ఆ దొంగ మంచి చెడు చేశాడో.. మంచి చేశాడో దాస్వాని కుటుంబసభ్యులకు అర్థం కాలేదు. ఆ దొంగ తమకు తెలియకుండానే ఓ గొప్ప పెట్టుబడి పెట్టించారని దాస్వాని కుటుంబసభ్యులు లోలోపల సంతోషపడిపోతూ ఉండవచ్చు.
Also Read: Tollywood Jagan : ‘టాలీవుడ్ రియాక్షన్’ ఆపడమే అసలు వ్యూహం! జగన్ ప్లాన్ వర్కవుట్ అయినట్లేనా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
ప్రోఫెసర్ జయశంకర్ స్వగ్రామంపై సీఎం రేవంత్ ఫోకస్- కీలక జీవో విడుదల
ఇంట్లో జారిపడ్డ కేసీఆర్- యశోద ఆసుపత్రిలో చికిత్స
Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' IDFC Bk, Zomato, IIFL Sec, Olectra
Petrol-Diesel Price 08 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Top Headlines Today: యశోదలో చేరిన మాజీ సీఎం కేసీఆర్- రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
/body>