By: ABP Desam | Updated at : 14 Jan 2022 08:12 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ చివరకు పెళ్లికి దారి తీసింది. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో చేసేది లేక వారిద్దరూ ఇళ్లలో నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారి వారి ఇళ్లకు దూరంగా కాపురం కూడా పెట్టారు. ఇందులో విచిత్రం ఏముంది.. చాలా చోట్ల జరిగే ఘటనలే ఇవీ.. అంటారా! ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట యువతి యువకుడు కాదు. యువతి మరో యువతి. ఇలా ఇద్దరు అమ్మాయిలు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు, స్థానిక వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇద్దరు అమ్మాయిల మధ్య పరిచయం ప్రేమకు దారి తీసింది. వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్ చురు జిల్లాలోని రతన్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. హర్యానాలోని జింద్ అనే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి రాజస్థాన్ రతన్‌గఢ్‌లోని తన సోదరి అత్తారింటికి తొలిసారిగా ఏడాది క్రితం వెళ్లింది. అక్కడ ఆమెకు తన సోదరి ఆడపడుచు(18)ను తొలిసారిగా చూసింది. వెంటనే వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. క్రమంగా అది ఇద్దరి మధ్య ప్రేమగా మారిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు.
అనంతరం వీరి సంగతి తెలిసిన ఇరువురి కుటుంబ సభ్యులు వాళ్లు ఇద్దరూ కలుసుకోకుండా చేశారు. ఒకరినొకరు కలవ వద్దని కఠిన ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ఒకరినొకరు వదిలి ఉండలేని వారిద్దరూ గతేడాది నవంబరులో రతన్‌గఢ్‌కు చెందిన యువతి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. హర్యానాలోని అదంపుర్ మండీకి చేరుకుని తన ప్రియురాలిని కలుసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి హర్యానాలోని ఫతేహ్‌బాద్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హర్యానాలోనే జింద్ అనే నగరంలో ఇల్లు అద్దెకు తీసుకొని గత రెండు నెలలుగా కలిసి ఉంటున్నారు.
ఈలోపు రతన్‌గఢ్‌లోని యువతి తండ్రి తన కూతురు కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు జనవరి 12న ఆ ఇద్దరు యువతుల ఆచూకీ గుర్తించారు. పెళ్లి రద్దు చేసుకొని ఇద్దరూ విడిపోవాలని, తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కుటుంబ సభ్యులు, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ, ఆ యువతులు తాము జంటగా ఉండే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని తెగేసి చెప్పేశారు. ఎంత చెప్పినా వినకపోతుండడంతో పోలీసులు కూడా చేసేదేమీ లేక వారిని తిరిగి పంపేశారు.
Also Read: Bandi Sanjay : ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు వెళ్తారన్న బండి సంజయ్ !
Also Read: Hyderabad: ఎర్రగడ్డ సంతలో కత్తులు కొని మాజీ భార్యపై ఘాతుకం.. నడిరోడ్డుపైనే కత్తిపోట్లు
Baramulla Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం
Hardik Patel: భాజపాలో చేరడం ఓ ఆప్షన్- కాంగ్రెస్ కన్నా ఆప్ బెస్ట్: హార్దిక్ పటేల్
Rajya Sabha Elections 2022: కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ గుడ్‌బై- ఎస్పీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల బరిలో!
Corona Cases: దేశంలో కొత్తగా 2వేలకు పైగా కేసులు- 17 మంది మృతి
Bharat Bandh : సీపీఎస్ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?