Lok Sabha Elections 2024 Results: ఈ ఓటమి మోదీదే కాదు అదానీది కూడా, యూపీ ఓటర్లు మేజిక్ చేశారు - ఫలితాలపై రాహుల్ కామెంట్స్
Lok Sabha Elections 2024 Results: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Elections 2024 Results: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు మోదీని ఓడించారని తేల్చి చెప్పారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదని అన్నారు. మోదీ, అమిత్‌షాలు వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శించారు. ఈ ఎన్నిల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారని సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము పోరాటం చేసినట్టు స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఐకమత్యంతో పని చేసిందని వెల్లడించారు. బీజేపీతో పాటు ఎన్నో సంస్థలతో పోరాడామని రాహుల్ వివరించారు.
"ఈ ఎన్నికల్లో మేం పోరాడింది కేవలం బీజేపీతోనే కాదు. ఎన్నో సంస్థలతో పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ దేశ వ్యవస్థతో పోరాటం చేశాం. సీబీఐ,ఈడీ దర్యాప్తు సంస్థలతోనూ పోరాటం చేశాం. ఈ సంస్థలన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తమ గుప్పిట్లో పెట్టుకుని ఆడించారు. దేశ ప్రజలు మోదీని ఓడించారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
#WATCH | Delhi | Addressing a press conference, Congress leader Rahul Gandhi says, "We fought this election not just against BJP but also the institutions, the governance structure of the country, the intelligence agencies CBI &EDI, judiciary because all these institutions were… pic.twitter.com/VbhckSJEvW
— ANI (@ANI) June 4, 2024
యూపీ ఓటర్లపై రాహుల్ ప్రశంసలు..
యూపీ ఎన్నికల ఫలితాలపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. యూపీ ఓటర్లు మేజిక్ చేశారని ప్రశంసించారు. వాళ్లు దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించారంటూ ప్రశంసించారు. కాంగ్రెస్‌కి అండగా నిలబడినందుకు ధన్యవాదాలు చెప్పారు.
"యూపీ ఓటర్లు మేజిక్ చేశారు. దేశ రాజకీయాల్ని వాళ్లు చాలా బాగా అర్థం చేసుకున్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని వాళ్లకు అర్థమైంది. వాళ్లే మన దేశా రాజ్యాంగాన్ని కాపాడారు. కాంగ్రెస్ పార్టీకి, ఇండీ కూటమికి అండగా నిలిచిన యూపీ ఓటర్లకు ధన్యవాదాలు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
#WATCH | Congress leader Rahul Gandhi says, "UP ki janta ne kamaal karke dikha diya...The people of UP understood the politics of the country and the danger to the Constitution, and they safeguarded the Constitution. I thank them for supporting Congress party and INDIA… pic.twitter.com/hNxvqRNjp2
— ANI (@ANI) June 4, 2024
తమ తదుపరి కార్యాచరణ ఏమిటో రాహుల్ వెల్లడించారు. ఇండీ కూటమిలోని అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరించారు. త్వరలోనే అందరితోనూ సమావేశమవుతామని, ఆ తరవాతే నిర్ణయాలు ప్రకటిస్తామని వెల్లడించారు. వాళ్లను అడగకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని తేల్చి చెప్పారు.