Law of Pakistan: ఆ దేశంలో వేరే వాళ్ల ఫోన్ ముట్టుకుంటే నేరుగా జైలుకే, లివిన్ రిలేషన్‌షిప్‌లూ కుదరవ్
Pakistan Laws: పాకిస్థాన్‌లో కొన్ని వింత చట్టాలు ఉన్నాయి.
Strange Laws of Pakistan:
పాకిస్థాన్‌లో వింత చట్టాలు..
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఎంత దారుణమైన పరిస్థితులున్నాయో ప్రపంచమంతా గమనిస్తోంది. ఉగ్రదాడులూ పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణంతో ప్రజలు సతమతం అవుతున్నారు. ప్రభుత్వం ఏం చేయాలో తెలియక చేతులెత్తేసింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా పాకిస్థాన్ పేరు మారుమోగుతోంది. అసలు అక్కడి విధానాలేంటి..? చట్టాలేంటి..? అని ఆరా తీస్తున్నారంతా. ఈ అన్వేషణలో ఆ దేశంలోని కొన్ని వింత చట్టాలు వెలుగులోకి వచ్చాయి. ఆ చట్టాలేంటో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఒకటుంది. ఏంటంటే.. పాకిస్థాన్‌లో ఎవరైనా సరే వేరే వాళ్ల ఫోన్‌ను ముట్టుకోకూడదు. అలా చేశారా...వెంటనే శిక్ష విధిస్తారు. అనుమతి లేకుండా ఫోన్ తీసుకుంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. పైగా 6 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాలి. అంతే కాదు. అక్కడ అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి జీవించేందుకు వీల్లేదు. అంటే లివిన్ రిలేషన్‌షిప్‌లు కుదరవన్నమాట. పెళ్లికి ముందే ఇలా కలిసున్నారని తెలిస్తే ఇద్దరినీ జైలుకు పంపుతారు. ఇప్పుడు మరో చట్టం గురించి చెప్పుకుందాం. సాధారణంగా పాకిస్థాన్‌లో అక్షరాస్యత చాలా తక్కువ. అయితే...అక్కడ కొన్ని పదాలను ట్రాన్స్‌లేట్ చేయటం చాలా పెద్ద నేరం. అల్లా, మసీద్, రసూల్, నబీ అనే పదాలను ఇంగ్లీష్‌లోకి అనుమతించడాన్ని పాక్ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తుంది. అవి ఎలా ఉన్నాయో అలానే రాయాలి తప్ప వాటిని అనువదించకూడదు. అలా కాదని రూల్ బ్రేక్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు.
చదువులకూ ట్యాక్స్ కట్టాలి..
ఇక అన్నింటికన్నా వింత చట్టం ఏంటంటే...చదువుకోడానికీ అక్కడి వాళ్లు ట్యాక్స్ కట్టడం. అక్కడ ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకుంది. ఆహార పదార్థాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. చదువులపై ట్యాక్స్ కొత్తగా వచ్చిందేమీ కాదు. అంతకు ముందు నుంచే వేస్తున్నారు. అయితే..ఇక్కడ ఓ కండీషన్ ఉంది. తమ చదువుల కోసం రూ.2 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందనుకుంటేనే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. ఇక మరో రూల్ గురించి కూడా చెప్పుకుందాం. పాకిస్థాన్ ప్రజలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు ఆ ఒక్క దేశానికి తప్ప. అదే ఇజ్రాయేల్. పాక్ పౌరులెవరూ ఇజ్రాయేల్‌కు వెళ్లేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది ప్రభుత్వం. పాలస్తీనాతో ఉన్న విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
దివాలా..
పాకిస్థాన్ దివాలా అంచున ఉంది. క్లిష్ట పరిస్థితుల నుంచి దేశాన్ని బయటకు తెచ్చేందుకు IMF నుంచి బెయిలౌట్ ఫండ్‌ను (bailout fund) పాక్ కోరింది. కానీ, కొత్త నిధుల జారీకి అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) అంగీకరించలేదు. పాకిస్థాన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మధ్య జరిగిన చర్చలు విఫలమైనట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. దేశం దివాలా (Bankruptcy) తీయకుండా ఉండేందుకు త్వరలోనే ఒప్పందం ఖరారు చేసుకుంటామని పాకిస్థాన్ ఆర్థిక శాఖ కార్యదర్శి హమీద్ షేక్ వెల్లడించారు. పాక్ న్యూస్ ఛానల్ జియో న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. బెయిలౌట్ ప్యాకేజ్ పొందేందుకు అవసరమైన చర్యలపై ఇప్పటికే IMFతో చర్చించామని ఆర్థిక కార్యదర్శి హమీద్ షేక్ చెప్పారు. త్వరలో కొన్ని కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
Also Read: ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానంతో పని చేయాలి- ఐపీఎస్‌ల ప్యాసింగ్ పరేడ్‌లో అమిత్ షా