అన్వేషించండి

Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వదంతులు... స్పందించిన లతా దీదీ కుటుంబ సభ్యులు... వైద్యుల ప్రకటన ట్వీట్

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై కుటుంబ సభ్యులు స్పందించారు. వైద్యులు తెలిపిన ప్రకటనను లతా దీదీ కుటుంబ సభ్యులు ట్వీట్ చేశారు. ఆమె ఆర్యోగ పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు.

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్(92) కు కరోనా సోకడంతో ఆమె ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయి. లతా మంగేష్కర్ తన ఇంటి సిబ్బందిలో  ఒకరి నుంచి వైరస్ బారిన పడ్డారు. లతా మంగేష్కర్ ఆరోగ్యంపై మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లతా దీదీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా ప్రకటన చేశారు. లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని అన్నారు. లతా మంగేష్కర్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో వైద్యులు ‘లతా ఆరోగ్యంపై ఊహాగానాలను ఆపమని’ అభ్యర్థించారు గాయని ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించిందని తెలియజేశారు.

ఆ ట్వీట్‌లో “లతా ఆరోగ్యంపై ఊహాగానాలను ఆపమని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నామని డాక్టర్ ప్రతీత్ సమదానీ ట్వీ్ట్ చేశారు. లతా దీదీ మునుపటి కంటే సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్నారు.  ఆమె త్వరగా కోలుకోవాలని ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నామని లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు తెలిపారు. లతా మంగేష్కర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం లతా దీదీ న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఆమె ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. లతా మంగేష్కర్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్ ప్రతిత్ సమదానీ గతంలో ఏఎన్ఐతో మాట్లాడుతూ లతా దీదీ వృద్ధాప్యం కారణంగా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు. 

Also Read: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్లు ఏం అన్నారంటే?

లతా మంగేష్కర్ ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. లతా కుటుంబ సభ్యుల సందేశాన్ని వెల్లడించారు. ఆమెకు వైద్యం అందిస్తోన్న వైద్యుల ప్రకటనను ట్విట్ చేశారు. వదంతులు వ్యాప్తి చేయొద్దని లతా దీదీ కుటుంబ సభ్యులు కోరారు. ఆమె చికిత్సకు మెరుగ్గా స్పందిస్తున్నారని తెలిపారు. అన్నీ సహకరిస్తే త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారన్నారు. ఈ సమయంలో వదంతులకు దూరంగా ఉండాలని అభ్యర్థించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని స్మృతి ఇరానీ ట్విటర్‌ వేదికగా అభ్యర్థించారు. 

Also Read:  పేరే.. 'నిర్మల'! ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో 'మదురై మీనాక్షి'!!

టాప్ హెడ్ లైన్స్

England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget