By: Ram Manohar | Updated at : 11 Mar 2023 10:52 AM (IST)
సీబీఐ బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు సమన్లు జారీ చేసింది. (Image Credits: ANI)
Land-For-Jobs Scam:
దేశవ్యాప్తంగా సోదాలు..
దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లోని స్కామ్ కేసుల్లో భాగంగా విచారణ చేపడుతోంది. ఈ క్రమంలోనే లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్న అధికారులు దీని విచారణ ప్రారంభించారు. ఢిల్లీ, ముంబయి, పట్నాల్లో ఇప్పటికే సోదాలు జరిగాయి. బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. అటు సీబీఐ కూడా రంగంలోకి దిగి ఈ కేసుని విచారిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే తేజస్వీ యాదవ్‌కు సమన్లు జారీ చేసింది. వెంటనే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో ఆయన హస్తమూ ఉందని అనుమానిస్తోంది సీబీఐ. ఇదే కేసులో ఫిబ్రవరి 4వ తేదీన సమన్లు జారీ చేసిన సీబీఐ ఇప్పుడు మరోసారి సమన్లు పంపింది.
CBI has summoned Bihar Deputy CM and RJD leader Tejashwi Yadav today, March 11 in connection with land-for-job case. This is the second summon issued to him, the first being issued on 4th February: Agency official
(File photo) pic.twitter.com/8s564sDzu2 — ANI (@ANI) March 11, 2023
ఇదీ కేసు..
ఢిల్లీ, ముంబయి, పాట్నాలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ విచారణలో భాగంగా ఈ మూడు చోట్ల సోదాలు చేస్తున్నారు అధికారులు. ఢిల్లీలోనే 15 చోట్ల సోదాలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూతుళ్ల ఇంట్లోనూ రెయిడ్స్ జరిగాయి. వీరితో పాటు ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే అబు దోజన ఇంట్లోనూ సోదాలు చేశారు. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఉచ్చు బిగుసుకుంటోంది. రెండ్రోజుల క్రితమే ఢిల్లీలో ఆయనను విచారించారు సీబీఐ అధికారులు. అటు ఈడీ కూడా వరుసగా సోదాలు చేపడుతూనే ఉంది. బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఇంట్లోనూ సోదాలు చేస్తున్నట్టు సమాచారం. లాలూ హయాంలో ఈ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గ్రూప్ డి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు చోట్ల స్థలాలను లంచంగా తీసుకున్నట్టు చెబుతోంది ఈడీ. 2004-09 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఈ స్కామ్ జరిగినట్టు ED అధికారులు ఆరోపిస్తున్నారు. ముంబయి, జబల్పూర్, కోల్కత్తా, జైపూర్, హాజిపూర్లలో పలువురికి గ్రూప్ D పోస్ట్లు ఇచ్చారని, అందుకు బదులుగా తమ పేరు మీద స్థలాలు రాయించుకున్నారని చెబుతున్నారు. AK Infosystems Private Limited పేరు మీద కూడా స్థలాలు రాయించారని ED వివరిస్తోంది. ఆ తరవాత ఈ కంపెనీ ఓనర్షిప్ను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల పేరుపై మార్చారన్న ఆరోపణలున్నాయి.
Also Read: KTR In Delhi: ఢిల్లీలో కవితతో మంత్రి కేటీఆర్ భేటీ, ఈడీ విచారణపై న్యాయ నిపుణులతో కీలకాంశాలపై చర్చ
జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు
Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!
Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్
Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్