News
News
X

KTR In Delhi: ఢిల్లీలో కవితతో మంత్రి కేటీఆర్ భేటీ, ఈడీ విచారణపై న్యాయ నిపుణులతో కీలకాంశాలపై చర్చ

MLC Kavitha ED Probe in Delhi: తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరు కానున్నారు.

FOLLOW US: 
Share:

Delhi Liquor Scam Case:  తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరు కానున్నారు. ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరయ్యే అవకాశం ఉండటంతో సోదరికి మద్దతుగా నిలిచేందుకు శుక్రవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ న్యాయ నిపుణులతో కలిసి హుటాహుటీన ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ తన సోదరి కవితతో భేటీ అయ్యారు. ఈడీ విచారణపై న్యాయ నిపుణులతో కేటీఆర్, కవిత పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని మంత్రి కేటీఆర్ ఢిల్లీలో ఉన్న కవితకు చేరవేశారని.. ఈడీ విచారణను ఎదుర్కోనున్న ఆమెకు కొండంత ధైర్యాన్ని ఇస్తుందనడంతో సందేహం లేదు. కానీ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంపై ఈడీ అడిగే ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలి అనేది సవాల్ గా మారుతుంది. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.

ఈడీ కస్టడీలోనే ఉన్న రామచంద్ర పిళ్లై ఆయన స్వయంగా తాను కవిత బినామీనని వాంగ్మూలం ఇచ్చారు. కానీ తన వాంగ్మూలాన్నివెనక్కి తీసుకుంటానని పిళ్లై హౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ తో సంబంధం లేకుండా ఈడీ కస్టడీలో ప్రశ్నించి అదనపు వివరాలు రాబడుతోంది. స్వయంగా కవితకు బినామీనని ఒప్పుకున్నందున ఇద్దర్నీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడీ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. పిళ్లై వాంగ్మూలంపై కవిత ఏం చెప్పనున్నారు, ఈడీ నోటీసులు ఇచ్చిన సెక్షన్లపై ఎలా స్పందించాలి, వాటి పరిధికి సంబంధించి పూర్తి వివరాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు కేటీఆర్, కవిత. రెండు రోజులపాటు కేటీఆర్ ఢిల్లీలో ఉండనున్నారని సమాచారం.

మహిళా బిల్లుకు మద్దతుగా కవిత ఢిల్లీకి బయలుదేరే సమయంలో ముందు ప్రగతిభవన్ కు వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా నేరుగా శంషాబాద్ కు వెళ్లిన కవిత ఢిల్లీకి చేరుకున్నారు. నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో దీక్ష కొనసాగించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చే బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ కవిత దీక్ష చేశారు. కవిత చేసిన దీక్షకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు తెలిపారు.

మనీశ్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ స్కామ్ జరిగిందని మనీశ్‌ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. శుక్రవారం దిల్లీ కోర్టులో ఆప్ నేత సిసోడియాను ఈడీ అధికారులు  హాజరుపరిచారు. సిసోడియా రిమాండ్‌ రిపోర్టులో రాజకీయ, ఆర్థిక, నేరపూరిత వ్యవహారాలను ఈడీ బయటపెట్టడింది. లిక్కర్‌ స్కామ్‌ హైదరాబాద్‌ లోనే ప్లాన్ చేశారని తెలిపింది. దినేష్ అరోరాను సౌత్ గ్రూప్ హైదరాబాద్‌కు పిలిపించిందని, ఐటీసీ కోహినూర్‌లోనే కీలక చర్చలు జరిగాయని ఈడీ రిపోర్టులో పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు, దిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఈ విషయం తెలుసని, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు చెప్పారని ఈడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. తాము ఎంపిక చేసిన హోల్‌సేల్ వ్యాపారులు 12 శాతం ప్రాపిట్ మార్జిన్‌ వచ్చే విధంగా పాలసీని రూపొందించినట్లు ఈడీ తెలిపింది. ఇది ఉండాల్సిన దానికంటే ఆరు శాతం ఎక్కువ ఉందని వెల్లడించింది.

Published at : 10 Mar 2023 10:32 PM (IST) Tags: KTR Kavitha BRS Delhi Liquor Scam Kavitha to ED Probe

సంబంధిత కథనాలు

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

Bandi Sanjay vs KTR: మంత్రి కేటీఆర్‌, బండి సంజయ్‌ పొలిటికల్‌ పంచాంగాలు ట్రెండింగ్ - ఓ రేంజ్ లో పంచ్ లు!

Bandi Sanjay vs KTR: మంత్రి కేటీఆర్‌, బండి సంజయ్‌ పొలిటికల్‌ పంచాంగాలు ట్రెండింగ్ - ఓ రేంజ్ లో పంచ్ లు!

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

TSPSC Paper Leak: 'పేపర్ లీక్' దర్యాప్తు ముమ్మరం, 40 మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి నోటీసులు జారీ!

టాప్ స్టోరీస్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Political Panchamgam : ఏ పార్టీ పంచాంగం వారిదే - రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?

Political  Panchamgam :  ఏ పార్టీ పంచాంగం వారిదే -  రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?