అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Krishna News: ఇన్ స్టాలో వలపు వల - పెళ్లిళ్ల పేరుతో యువకులకు టోకరా, 31.66 లక్షలు స్వాహా!

Krishna Crime News: తన అందం, అభినయంతో టిక్ టాక్ లో యువకులకు వలపు వల వేస్తుంది. చిక్కిన వాళ్లను పెళ్లి చేసుకుంటానని చెప్తూ మోసం చేసి లక్షలు కొట్టేస్తుంది. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతోంది. 

Krishna Crime News: అందం, అభినయంతో టిక్ టిక్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా వీడియోలు పెడుతుంది. ఫాలోవర్లను పెంచుకునేందుకు చేయాల్సిన అన్ని పనులు చేస్తుంది. దాదాపు నాలుగైదు అకౌంట్ల నుంచి వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ వచ్చింది. ఆమె అందం చూసి ముగ్ధులైన చాలా మంది మెసేజ్ లు చేసేవారు. దాంతో ఆమె నేరుగా కాకుండా వారికి పర్సనల్ గా మెసేజ్ లు చేసేది. ఫొటోలు పంపుతూ, వారిని పంపమంటూ ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో వలపు వల విసిరేది. చిక్కిన యువకుల వద్ద నుంచి డబ్బులు అవసరం ఉన్నాయి, బహుమతులు కావాలంటూ లక్షల్లో వసూలు చేసేది. అలా ఎనిమిది నెలల్లోనే దాదాపు 32 లక్షల వరకూ కాజేసింది. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ లోని మచిలీపట్నంకు చెందిన పరసా తనుశ్రీ ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసేది. సినిమా పాటలు, డైలాగ్ లు ఇలా అన్నింటినీ అనుకరిస్తూ చేసి పోస్టు చేసేది. మొత్తం నాలుగు ఖాతాల ద్వారా ఆమె ఈ వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంది. వారంతా ఆమె అందాన్ని పొగుడుతూ, ప్రేమిస్తున్నామంటూ కామెంట్లు కూడా చేసేవారు. అయితే కృష్ణా జిల్లాకు చెందిన పరసా రవితేజతో కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్లను మోసం చేయడం ప్రారంభించింది. కామెంట్లు పెట్టే వారికి తిరిగి వ్యక్తిగతంగా సందేశాలు పంపించేది. పెల్లి చేసుకుంటానంటూ నమ్మంచి డబ్బులు వసూలు చేసేది. ఇలా హైదరాబాద్ కు చెంది ఓ వ్యక్తితో స్నేహం పెరిగాక పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అనంతరం తన తల్లికి అనారోగ్యం తదితర కారణాలు చెప్పి 8 నెలల్లో రూ.31.66 లక్షలు వూలు చేసింది. ఆమెది మోసమన గ్రహించిన ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తనుశ్రీ, రవితేజలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

యువతిని పెళ్లి చేసుకొని డబ్బులతో పారిపోయిన కానిస్టేబుల్

పల్నాడు జిల్లా నరసరావుపేటలో నాలుగు నెలల క్రితం కానిస్టేబుల్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని కానిస్టేబుల్ మోసం చేశాడు. బాధితురాలు తనకు న్యాయం చేయాలని ఎస్పీని స్పందనలో కోరింది. సోషల్ మీడియాలో పరిచయమై కానిస్టేబుల్ పెళ్లి చేసుకుంటానని ఐదు లక్షల కట్నం తీసుకొని మోసం చేశాడని యువతి ఆరోపిస్తుంది. సోమవారం స్పందనలో ఎస్పీకి యువతి ఫిర్యాదు చేసింది. గుంటూరుకు చెందిన రాజేష్ అనే వ్యక్తి కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన యువతితో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎంగేజ్మెంట్ చేసుకుని రూ.5 లక్షలు నగదు తీసుకొని ఇప్పుడు మొహం చాటేశాడని యువతి ఫిర్యాదులో తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకుంది.  

అసలేం జరిగింది? 

'గుంటూరు చెందిన రాజేష్ అనే వ్యక్తి సోషల్ మీడియో పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఎంగేజ్మెంట్ చేసుకుని రూ.5 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు పెళ్లి చేసుకోలేను అని మాట దాటేస్తున్నాడు. స్పందనలో ఫిర్యాదు చేసేందుకు వస్తే కంప్లైంట్ వద్దని మాట్లాడుకుందామని చెప్పాడు. నమ్మి వాళ్లింటికి వెళ్లాను. అక్కడ నుంచి అతడు పారిపోయాడు. వాళ్ల నాన్న మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు. సస్పండ్ చేస్తారు అంతే కాదా? అంటున్నారు. పెళ్లి మాత్రం చేయనని రాజేష్ తండ్రి అంటున్నారు. రాజేష్ పెళ్లి చేసేశామని చెబుతున్నారు.'  - బాధితురాలు

ఏడేళ్ల కిందట పరిచయం..

'సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. ఏడేళ్ల క్రితం మాకు పరిచయం అయింది. పెళ్లి చేసుకుంటానని వాళ్ల అమ్మ నాన్నలను మా ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ల మేనమామ కూడా వచ్చాడు. మా అమ్మ నాన్నలతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. నాకు పరిచయం అయినప్పుడు బీటెక్ చేస్తున్నాడు. ఇప్పుడు నరసరావుపేటలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నానని చెప్పాడు. కానీ అది ఎంతవరకూ నిజమో తెలియదు. పది హేను రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అంతకు ముందు మాట్లాడాడు. ' -బాధిత యువతి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget