Kolkata woman doctor rape and murder: ముందే చంపి ఆ తర్వాత రేప్ చేశారా ? - కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో ఎన్నో అనుమానాలు
Kolkata doctor murder case : కోల్‌కతాలో మహిళా వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఆ వైద్యురాల్ని చంపిన తర్వాత రేప్ చేశారని పోలీసుల అనుమానిస్తున్నారు.
Kolkata doctor murder case possibility that Doctor was first killed and then raped : పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. ఆమెను ముందుగా చంపి ఆ తర్వాత రేప్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోల్‌కతాలో ఉన్న ఓ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించిన ఆ మహిళా జూనియర్ డాక్టర్ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లింది. కానీ ఉదయానికి హత్యకు గురై కనిపించింది. పోస్టుమార్టంలో కీలక విషయాలు బయటికి వచ్చాయి. బాధితురాలిపై దారుణంగా లైంగిక దాడి జరిగిందని.. ఆమె శరీరంపై, ప్రైవేటు భాగాలపై తీవ్రంగా గాయాలు అయినట్లు పోస్టుమార్టమ్‌లో గుర్తించారు. అతి కిరాతకంగా ఆమెను హింసించి చంపినట్లు తేల్చారు.
అయితే హత్య జరిగిన విధానం చూస్తే ముందు ఆమెను చంపేసారిని ఆ తర్వాత రేప్ చేశారని అనుమానిస్తున్నారు. . నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని.. అవసరం అయితే ఉరిశిక్ష కూడా పడేలా చూస్తామని మమతా బెనర్జీ చెప్పారు. పోలీసులు సాంకేతికత ఓ నిందితుడ్ని అరెస్టు చేశారు. మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకుని ఇప్పటికే ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. అతడికి.. మెడికల్ కాలేజీతో సంబంధం లేదని వాలంటరీగా వచ్చి సేవలు చేసినట్లుగా కొంత కాలంగా అక్కడే తచ్చాడుతున్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే ఈ కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ - సిట్‌ను మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిందితులను పట్టుకునేందుకు ఈ పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఉపయోగపడుతుందని పోలీసులు చెప్పారు. బాధ్యులైన నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటామని ఒక్క రోజులో వారిని అరెస్టు చేయకపోతే దర్యాప్తును సీబీఐకి సిఫారసు చేస్తామన్నారు.
మరో వైపు పీజీ వైద్య విద్యార్థిని మృతికి నిరసనగా డాక్టర్లు దేశంవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో సోమవారం వైద్యసేవలను నిలిపివేశారు. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు అత్యవసరం మినహా అన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాతో పాటు ఇతర నగరాల్లోని వైద్యులు ప్రకటించారు. వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. కోల్ కతా ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆదివారం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. 24 గంటల డెడ్‌లైన్ ఇచ్చింది. లేదంటే ఆస్పత్రుల్లో వైద్య సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏండ్ల ట్రైనీ డాక్టర్ ను రేప్ చేసి హత్య చేసిన సంఘటన తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని కేటీఆర్ అన్నారు. హాస్పిటల్ లో కూడా డాక్టర్లు సురక్షితంగా ఉండకపోతే మన ఆడపిల్లలు ఇంకెక్కడ క్షేమంగా ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంత క్రూరమైన ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టకూడదని కేటీఆర్ అన్నారు. బెంగాల్ లోని మమతా సర్కార్ నేరస్తున్ని పట్టుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తుందని నమ్ముతున్నట్లు కేటీఆర్ తెలిపారు. నిరసన తెలుపుతున్న డాక్టర్లకు కేటీఆర్ సంఘీభావం తెలిపారు.