Farmers Loan: రైతుల కోసం స్పెషల్ స్కీమ్- రూ.50 వేల లోన్ పొందే పథకం
Farmers Loan: రైతుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. ఈ కొత్త పథకం ద్వారా రూ.50 వేల వరకు లోన్ తీసుకోవచ్చు.
Farmers Loan: రైతులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. అన్నదాతలు చాలా సులభంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం పొందవచ్చు. ఇందు కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక కొత్త పథకాన్ని తీసుకు వచ్చింది. ప్రభుత్వ రంగానికి చెందిన పీఎన్బీ.. రైతుల కోసం ప్రత్యేకంగా కొత్త స్కీమ్‌ను తీసుకు వచ్చింది. ఈ కొత్త పథకానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పీఎన్బీ కిసాన్ తత్కాల్ రిన్ యోజన అనే పేరు పెట్టింది. ఈ పథకం కింద రైతులు చాలా సులభంగా, తక్కువ సమయంలోనే రుణం పొందవచ్చు. రూ.50 వేల వరకు రుణాలు ఈ పథకం కింద ఇస్తారు. గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే.. ఈ పథకం ద్వారా లోన్లు పొంద రైతులు.. తీసుకున్న రుణానికి ఎలాంటి తనఖా పెట్టాల్సిన అఅవసరం లేదని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది.
ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు
పీఎన్బీ అందిస్తున్న ఈ పథకం ద్వారా రుణాలు పొందిన రైతులకు డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే జమ అవుతాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అన్నదాతలు వారి ఆర్థిక అవసరాల కోసం పీఎన్బీ నుంచి కిసాన్ తత్కాల్ రిన్ యోజన కింద రుణాలు పొందవచ్చని, ఈ పథకం వెంటనే అందబాటులోకి వచ్చిందని పీఎన్బీ ట్వీట్ చేసింది. అయితే కిసాన్ తత్కాల్ రిన్ యోజన కింద గరిష్ఠంగా 50 వేల రూపాయలు మాత్రం రుణం కింద తీసుకోవచ్చు. ఈ మొత్తం లోన్‌గా తీసుకోవడానికి ఎలాంటి గ్యారంటీ అవసరం లేదు. కనీస డాక్యుమెంట్లు మాత్రం బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది.
రైతులకు మాత్రమే
కేవలం వ్యవసాయ పనుల కోసమే కాకుండా... రుణం ద్వారా పొందిన మొత్తాన్ని ఎలాంటి అవసరానికి అయినా వాడుకోవచ్చని పీఎన్‌బీ ప్రత్యేకంగా చెప్పింది. రైతులకు ఆర్థికంగా సాయం చేసేందుకు ఈ కొత్త స్కీమ్ తీసుకువచ్చిన దాని ద్వారా రుణాలు ఇస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది. అయితే రుణాలు కావాలని బ్యాంక్‌కు వచ్చే వారు మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిందే. అదేంటంటే.. ఈ స్కీమ్ కింద రుణాలు పొందాలనుకుంటే.. వ్యవసాయ భూమి ఉండాలని, లేదంటే.. వేరే వారి భూమిని కౌలుకు తీసుకుని, సాగు చేస్తున్నా లోన్ పొంద వచ్చని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిబంధన పెట్టింది. ఈ కిసాన్ తత్కాల్ రిన్ యోజన కింద కేవలం రైతులు, రైతు బృందాలు మాత్రమే లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది.
ఐదేళ్లలోపు చెల్లించాలి
అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన రైతులు కూడా బ్యాంక్ నుండి ఈ స్కీమ్ ద్వారా రుణం పొందవచ్చు. అయితే రెండేళ్లుగా బ్యాంక్ రికార్డులను కచ్చితంగా సక్రమంగా ఉండాలన్న నిబంధనగా పీఎన్ బీ పేర్కొంది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పొందిన రుణాలను సక్రమంగా చెల్లిస్తూ ఉండే వారికి చాలా సులభంగా పీఎన్ బీ ద్వారా రుణం పొందవచ్చు. కిసాన్ తత్కాల్ రిన్ యోజన ద్వారా పొందిన రుణాన్ని ఐదు సంవత్సరాల్లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.