Kerala Semi High-Speed Rail: కేరళలో పరుగులు పెట్టనున్న సెమీ హై-స్పీడ్ రైలు... కేరళ ప్రభుత్వం, రైల్వే శాఖ జాయింట్ వెంచర్
కేరళలో సెమీ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేరళ ప్రభుత్వం, రైల్వే శాఖ జాయింట్ వెంచర్ తో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
కేరళలో సెమీ హై-స్పీడ్ రైలు పరుగులు పెట్టనుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అనుమతులు ఇచ్చింది. తాజాగా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో దీనిపై ఓ ప్రకటన చేశారు. తిరువనంతపురం నుంచి కాసర్ గోడ్ వరకు సెమీ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు ప్రకటించారు. గతంలో తిరువనంతపురం నుంచి కాసర్ గోడ్ కు వెళ్లాలంటే 12 గంటలు పడుతుంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే 12 గంటల సమయం కేవలం 4 గంటలకు తగ్గుతుంది.
Also Read : దేశంలో 25కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. తాజాగా గుజరాత్‌లో మరో ఇద్దరికి..
Project of Semi High-Speed Rail (531 Km) from Thiruvananthapuram to Kasargod has been identified by Kerala Rail Development Corporation Limited (KRDCL), a Joint Venture company of Kerala Govt (51%) and Ministry of Railways (49%) for development: Railway Minister Ashwini Vaishnaw pic.twitter.com/oMDttsOors
— ANI (@ANI) December 10, 2021
రైల్వే శాఖ మంత్రి ప్రకటన
కేరళలోని తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్ వరకు సెమీ హై-స్పీడ్ రైలు(531 కి.మీ) ప్రాజెక్ట్ ను కేరళ రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (KRDCL) అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టులో కేరళ ప్రభుత్వం (51%), రైల్వే మంత్రిత్వ శాఖ (49%) జాయింట్ వెంచర్ పనిచేయనున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటించారు. కేరళ రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు కోసం డీపీఆర్ సిద్ధం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 63,941 కోట్లుగా అంచనా వేశారు. ప్రస్తుతానికి నిధుల సమీకరణాన్ని వెల్లడించలేమన్నారని రైల్వే మంత్రి తెలిపారు.
Also Read : నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్
గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణం
కేరళ రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ సెమీ హై స్పీడ్ ప్రాజెక్ట్ చేపట్టనుంది. డబుల్ లైన్‌గా చేపట్టే ఈ మార్గంపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ట్రైన్లు పరుగులు తీయనున్నాయి. ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన కమిటీ ప్రాజెక్ట్ నివేదికను కేరళ రాష్ట్ర మంత్రివర్గం సమర్పించింది. దానిని ఆమోదించిన కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. 531 కిలోమీటర్ల ప్రయాణదూరం గల ఈ ప్రాజెక్ట్‌ను పర్యావరణహిత ప్రాజెక్ట్‌గా చేపట్టునున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఈ రైల్ కారిడార్ ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తితో 11 వేల మంది ఉద్యోగావకాశాలు పొందుతారని పేర్కొన్నారు. ఈ సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు రూ.63,079 వేల కోట్లు ఖర్చు కానున్నాయి.
Also Read: రైతు ఉద్యమానికి శుభం కార్డు.. దిల్లీ సరిహద్దుల నుంచి ఇళ్లకు రైతులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి