మామిడి పండ్లు దొంగిలించిన పోలీస్, పరువు తీశావంటూ ఫైర్ అయిన ఆఫీసర్‌లు - నెల రోజుల సస్పెన్షన్
Police Steals Mangoes: కేరళలో మామిడి పండ్లు దొంగిలంచిన పోలీస్‌ని నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు.
![మామిడి పండ్లు దొంగిలించిన పోలీస్, పరువు తీశావంటూ ఫైర్ అయిన ఆఫీసర్‌లు - నెల రోజుల సస్పెన్షన్ Kerala Police Dismiss a Cop For Stealing Mangoes, Know Details మామిడి పండ్లు దొంగిలించిన పోలీస్, పరువు తీశావంటూ ఫైర్ అయిన ఆఫీసర్‌లు - నెల రోజుల సస్పెన్షన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/27/5fcbc655e665bf9c176b1c15800a59c61682596983096517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Police Steals Mangoes:
ఫ్రూట్ బాక్స్ చోరీ
ఓ ఫ్రూట్ షాప్‌లో మామిడి పండ్లు దొంగిలించిన పోలీస్‌ని కేరళ పోలీసులు సస్పెండ్ చేశారు. కేరళలోని కంజిరప్పళ్లిలో గతేడాది సెప్టెంబర్‌లో జరిగిందీ చోరీ. ఆ షాప్ ఓనర్ కంప్లెయింట్ ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్నప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం సీరియస్ అయ్యారు. పోలీసులే ఇలా చేస్తే ప్రజలకు ఏం గౌరవం ఉంటుందని మండి పడ్డారు. ఆ పోలీస్‌ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్ పాస్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన వివరాల ప్రకారం సస్పెండ్‌కి గురైన పోలీస్ పేరు షిహాబ్. ఇడుక్కి జిల్లా పోలీసులు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు. పోలీసుల గౌరవానికి భంగం కలిగించిన కారణంగా విధుల నుంచి నెల రోజుల పాటు తొలగిస్తున్నట్టు స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో షిహాబ్ కొట్టాయం జిల్లాలోని కంజిరప్పళ్లిలో ఓ ఫ్రూట్ షాప్‌కి వెళ్లాడు. మెల్లగా అటూ ఇటు చూసి ఓ మామిడి పండ్ల బాక్స్‌ని తీసుకున్నాడు. టూ వీలర్‌పై పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. షాప్ ఓనర్ బయటకు వచ్చి చూస్తే ఫ్రూట్ బాక్స్ కనిపించలేదు. షాక్ అయ్యి వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు. పోలీస్ ఆ బాక్స్‌ని చోరీ చేసినట్టు క్లియర్‌గా అందులో కనిపించింది. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అవడం వల్ల ఆ పోలీస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది తెలుసుకుని నిందితుడు షిహాబ్ పరారయ్యాడు. సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు మొత్తానికి వెతికి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు. చాలా నేరాల్లో పోలీసుల హస్తం కూడా ఉంటోందని ఉన్నతాధికారుల వరకూ సమాచారం వెళ్లింది. దీనిపై చాలా అసహనంతో ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని వదిలే ప్రసక్తే లేదని పోలీసులు చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)