అన్వేషించండి

Breaking News Telugu Live Updates: కొత్తగూడెం నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
Breaking News Telugu Live Updates: కొత్తగూడెం నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్

Background

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం పడుతోంది. గత వారం రోజులతో పోల్చి చూసుకుంటే చలి తీవ్ర కాస్త తగ్గింది. వారం పది రోజుల పాటు గజగజ వణికిపోయిన జనాలు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఏర్పడిన పొడిగాలులు కర్ణాటకవైపు వెళ్లిపోవడంతో చలి తీవ్రత తగ్గింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి ఇన్ని రోజులు పొడిగాలులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందున రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మూడేళ్ల కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

పొడిగాలులు కర్ణాటకలోకి ప్రవేశించడంతో కర్ణాటకకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో చలి తీవ్రత కాస్త పెరిగింది. మిగతా ప్రాంతాల్లో చలి తీవ్రత తక్కువగా ఉంది. విశాఖ నగరంలో చలి గత నాలుగు రోజులతో పోలిస్తే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. విశాఖ నగరంతోపాటుగా నగర పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్లలో ప్రస్తుతం 20 డిగ్రీల సెల్సియస్‌కి పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్క కైలాసగిరి తప్ప మిగతా ప్రాంతాల్లో నార్మల్ వెదర్ ఉంది. ఈ ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో ఇంకా పెరగనున్నాయి. వచ్చే వారం నుంచి చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోనుంది. 

మత విద్వేషాలు రెచ్చగొడితే దేశం ఆప్ఘనిస్థాన్‌లా అవుతుందని..దీనిపై యువత ఆలోచన చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత బహిరంగసభలో మాట్లాడారు. కేంద్రం అసమర్థ విధానాలతో ఎంతో నష్టపోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం తీరుతో జీఎస్డీపీ వెనుకబడిందన్నారు. మహబూబాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. దేశ అభివృద్ధిపై యువకులు చర్చిచాలన్నారు. యువకులు ముందుకు వస్తేనే  దేశం బాగుపడుతుందన్నారు.  కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యనించారు.  20 ఏండ్లు గడిచినా కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులు రావటం లేదని ఆరోపించారు. 

గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మహబూబాబాద్ కు వచ్చినప్పుడు  తుంగతుర్తి, పాలకుర్తి, వర్ధన్నపేటలో కాల్వలు సగం గీకి, తీసినవి ఉన్నాయన్నారు. వీటిని చూసి ఈ జన్మలో నీళ్లు రావనుకున్నా. మంచిర్యాల, ములుగుకు వచ్చినప్పుడు చిల్లర వేసి మా నేలకు నీళ్లు రావాలని కోర్టుకున్నా. ఇక రాష్ట్రం సాకారం కావాలని కురవి వీరభద్ర స్వామిని కోరుకున్నా. అందుకే బంగారు మీసాలు చేయిస్తానని మొక్కుకొని తీర్చాను. మహబూబాబాద్ గతంలో చాలా వెనకబడ్డ ప్రాంతాలు. కానీ ఇప్పుడు జిల్లాగా మారి  అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. 

దేశంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ తొలిసారిగా విశాఖ కు చేరింది. కానీ కొందరు అల్లరిమూక వందే భారత్ రైలుపై బుధవారం సాయంత్రం మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రాళ్ల దాడికి పాల్పడటం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన విశాఖ పోలీసులతో పాటు ఆర్పీఎఫ్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో వందేభారత్ రైలుపై దాడిచేసి కిటికీలు ధ్వంసం చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు.

నిందితులు మద్యం మత్తులో ఉన్నారని, అందుకే ఈ దాడి చేసి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితులపై రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి ఆర్పీఎఫ్‌ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పారు. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై డీఆర్ఎం అనూప్ సత్పతి విచారణకు ఆదేశించారు.  

17:48 PM (IST)  •  12 Jan 2023

కొల్లాపూర్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్

కొల్లాపూర్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.

• జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన బండి సంజయ్.

• కొల్లాపూర్ సమగ్రాభివ్రుద్ధి కోరుతూ పాదయాత్ర చేస్తున్న బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావుతో కలిసి నడుస్తున్న బండి సంజయ్.

• పాదయాత్ర అనంతరం కొల్లాపూర్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్న బండి సంజయ్

17:19 PM (IST)  •  12 Jan 2023

కొత్తగూడెం నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్

మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పర్యటన అనంతరం హైదరాబాద్ బయలు దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కార్యక్రమాలకు శంకుస్థాపన, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలను, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. 

17:17 PM (IST)  •  12 Jan 2023

క్లిష్ట పరిస్థితుల్లో హోంమంత్రిగా ఠాక్రే సమర్థవంతంగా పని చేశారు: రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాయింట్స్..

టీ కాంగ్రెస్ ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు సమావేశం నిర్వహించారు.

ముంబై బాంబ్ బ్లాస్ట్, మతకల్లోలాలు జరిగిన సమయంలో ఆయన హోంమంత్రిగా పనిచేశారు.

క్లిష్ట పరిస్థితుల్లో హోంమంత్రిగా ఠాక్రే ఎంతో సమర్థవంతంగా పని చేశారు.

వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు హోంమంత్రిగా జానారెడ్డిలా... శరద్ పవార్ హయాంలో ఠాక్రే అంతటి సమర్థవంతంగా పనిచేశారు.

సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలి ప్రదర్శిస్తారని ఆయనకు గుర్తింపు ఉంది.

హాత్ సే హాత్ జోడో యాత్ర నేపథ్యంలో పార్టీలో అందరితో ఆయన మాట్లాడారు.

21న మరోసారి పర్యటించి పూర్తి స్థాయిలో హాత్ సే హాత్ జోడో యాత్ర కమిటీలను ప్రకటిస్తారు.

17:16 PM (IST)  •  12 Jan 2023

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది - తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే

మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్

రెండు రోజులపాటు రాష్ట్రంలో పరిస్థితులు, పార్టీలో పరిణామాలపై చర్చించాం

సీనియర్ నేతలతో మాట్లాడి, సమాచారం తీసుకున్నాం అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించాం.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కార్యకర్తలు, నాయకులు బలంగా ఉన్నారు. 

నేతలు, కార్యకర్తలు తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు  సమిష్టిగా కృషి చేయాలి.

తెలంగాణ లో ఇప్పుడు చాలా కీలకమైన సమయం..

భారత్ జోడో యాత్ర దేశంలో విజయవంతంగా నడుస్తుంది  

భారత్ జోడో యాత్ర పూర్తయ్యాక కొనసాగింపుగా దేశంలో హాత్ సే హాత్ జోడో యాత్ర జనవరి 26 నుంచి ప్రారంభం అవుతుంది.

భారత్ జోడో యాత్ర లో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని ప్రణాలిక చేసాము.

రాహుల్ సందేశాన్ని దేశంలో ప్రతీ ఇంటికి చేరవేసేందుకె హాత్ సే హాత్ జోడో యాత్ర.

జనవరి 26 నుంచి రెండు నెలలపాటు హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతుంది.

తెలంగాణలో ప్రతీ ఇంటికే రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేయాలి.

హాత్ సే హాత్ జోడో యాత్రకు మద్దతుగా అంతా కలిసిరండి.

ప్రతీ జిల్లా, ప్రతీ బ్లాక్ లో రెండు నెలలపాటు యాత్ర కొనసాగుతుంది.

ప్రతి ఇంటికి భారత్ జోడో యాత్ర పోస్టర్, ప్రతి చేతికి రాహుల్ గాంధీ సందేశాన్ని చేర్చే విదంగా హాత్ సే హాత్ అభియాన్ యాత్ర సాగుతుంది.

ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త,నాయకులు పాల్గొనాలి.

17:14 PM (IST)  •  12 Jan 2023

నిజామాబాద్ జిల్లాలో బాలయ్య అభిమానులు సందడి

నిజామాబాద్ జిల్లాలో బాలయ్య అభిమానులు సందడి చేశారు. వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ సందర్భంగా బోధన్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు సినిమా చూసేందుకు తరలివచ్చారు. దాదాపు 150 కార్లలో వీర సంహారెడ్డి జెండాను  వేసుకుని వచ్చారు. స్పెషల్ షో టికెట్స్ మొత్తం బోధన్ బాలయ్య అభిమానులు బుక్ చేసుకున్నారు. సినిమా హాల్ లో బాలయ్య అభిమానులు సందడి చేశారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget