By: Ram Manohar | Updated at : 05 Mar 2023 05:08 PM (IST)
హిజాబ్ ధరించి వస్తే ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతించమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది
Karnataka Hijab Row:
కర్ణాటక విద్యా మంత్రి ప్రకటన..
ప్రీ యూనివర్సిటీ కోర్స్ (PUC)ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు హిజాబ్ ధరించి రావడానికి వీల్లేదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. మార్చి 9 నుంచి ఈ పరీక్షలు మొదలు కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. హిజాబ్ ధరించి వచ్చే వాళ్లను పరీక్షా హాల్‌లోకి అనుమతించమని వెల్లడించారు. ఈ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని తెలిపారు. విద్యా సంస్థలన్నీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిబంధనలు అమలు చేయనున్నాయి. హిజాబ్‌పై నిషేధం విధించిన తరవాతే పరీక్షలు రాసే ముస్లిం విద్యార్థుల సంఖ్య పెరిగిందని విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ స్పష్టం చేశారు. అయితే ఏ మేరకు పెరిగిందన్న వివరాలు మాత్రం ఇవ్వలేదు. ఎగ్జామ్స్ కోసం ఎన్‌రోల్ చేసుకునే విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. దాదాపు ఏడాదిగా కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. సుప్రీం కోర్టులోనూ విచారణ జరిగింది. విద్యా సంస్థల్లో మత పరమైన ఆచారాలను పాటించడం సరికాదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. హిజాబ్‌పై నిషేధం విధించింది. సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగానే తీర్పునిచ్చింది.
ప్రత్యేక ధర్మాసనం..
కర్ణాటక హిజాబ్ వివాదంపై ఇటీవలే సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించిది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం. ముగ్గురు జడ్జ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఆ ధర్మాసనమే ఈ అంశంపై విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేపీ పర్దివాలా ధర్మాసనం ఈ విషయం తెలిపింది. ఓ మహిళా న్యాయవాది ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరగా...ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పరీక్షలు జరగనున్నాయని, హిజాబ్ ధరించి ఎగ్జామ్‌లు రాయడానికి అనుమతించకపోతే వాళ్లు ఓ అకాడమిక్ ఇయర్ నష్టపోవాల్సి వస్తుందని వివరించారు పిటిషనర్. అయితే...హోళీ పండుగ తరవాత ఈ అంశంపై విచారణ చేపడతామని చెప్పారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. పిటిషనర్ మాత్రం మరో 5 రోజుల్లో పరీక్షలున్నాయని వివరించారు. "ఇప్పటికే ఓ ఏడాది కోల్పోయారు. మరింత ఆలస్యమైతే మరో ఏడాది కూడా కోల్పోయే ప్రమాదముంది" అని చెప్పారు. ఆ తరవాతే చంద్రచూడ్ ముగ్గురు సభ్యులతో బెంచ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అయితే...ఎప్పుడు అన్నది మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
వివాదం..
ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించే ఎగ్జామ్స్ రాస్తామని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు అనుమతించడం లేదు. గతేడాది మార్చి 15వ తేదీన కర్ణాటక హైకోర్టు హిజాబ్‌ను అనుమతించాలని వేసిన పిటిషన్‌లన్నింటినీ కొట్టి పారేసింది. తరగతి గదులు మతపరమైన విధానాలు పాటించేందుకు వేదిక కావని తేల్చి చెప్పింది. ఆ తరవాతే ఈ వివాదం సుప్రీం కోర్టు గడప తొక్కింది. కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిజాబ్ వివాదంపై రెండు వర్గాల విద్యార్థులు పోటాపోటీగా నిరససలు చేశారు. ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించి రావడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు హాజరుకావడంతో వివాదం రాజుకుంది.
TSPSC Papers Leak: పేపర్స్ లీక్ నిందితులు రేణుక, భర్త డాక్యా నాయక్‌లపై వేటు
PRO-Khalistani Twitter Account: భారతదేశంలోని ఖలిస్తానీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్
Breaking News Live Telugu Updates: వడగండ్ల ప్రభావిత జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన, పంట నష్టంపై పరిశీలన
AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి
IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగ రాతపరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం