Karnataka Elections 2023: సోనియా గాంధీ ఓ విషకన్య, పాక్ చైనాకి ఏజెంట్‌లా పని చేశారు - బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Karnataka Elections 2023: బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ సోనియా గాంధీని విషకన్య అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Karnataka Elections 2023:
పాయిజన్ పాలిటిక్స్
కర్ణాటక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శల డోస్ పెరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని విషసర్పం అని చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. కేంద్ర మంత్రులంతా కాంగ్రెస్‌పై మండి పడ్డారు. వెంటనే వివరణ ఇచ్చారు ఖర్గే. అయినా బీజేపీ చల్లబడలేదు. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే యత్నాల్ ఖర్గే కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీని విషకన్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొప్పల్‌లో ఓ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే...ప్రపంచమంతా ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతోందని వెల్లడించారు. ఇదే క్రమంలో సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె పాకిస్థాన్, చైనాకి ఏజెంట్‌లా పని చేశారంటూ మండి పడ్డారు.
"ప్రపంచమంతా ప్రధాని నరేంద్ర మోదీ పని తీరుని ప్రశంసిస్తోంది. ఒకప్పుడు ఆయన అమెరికా వెళ్లాలనుకుంటే ఆ దేశం వీసా ఇవ్వలేదు. ఆ తరవాత అదే అమెరికా ప్రధానికి రెడ్‌కార్పెట్ వేసి ఆహ్వానించింది. అలాంటి వ్యక్తిని ఖర్గే విషసర్పం అని విమర్శించారు. ఆయన విషం చిమ్ముతారంటూ ఏవేవో మాట్లాడారు. అలా అయితే సోనియా గాంధీని విషకన్య అనాలా..? ఎందుకంటే ఆమె పాకిస్థాన్, చైనాకి ఏజెంట్‌లా పని చేశారు"
- యత్నాల్, బీజేపీ ఎమ్మెల్యే
#WATCH | While attacking Congress President Mallikarjun Kharge over his 'poisonous snake' remark on PM Modi, Karnataka BJP MLA Basanagouda Yatnal calls UPA chairperson Sonia Gandhi 'Vishkanya'
— ANI (@ANI) April 28, 2023
(27.04) pic.twitter.com/ZqMBHbudST
ఈ వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందించారు. ఓ బీజేపీ ఎమ్మెల్యే సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు మోదీ అమిత్‌షా ఎలా స్పందిస్తారో వేచి చూడాలని అన్నారు.
A Karnataka BJP MLA has called Mrs Sonia Gandhi a 'Vishkanya'. People want to know what PM Modi & Amit Shah have to say on this issue: Bhupesh Baghel, Chhattisgarh CM, in Raipur pic.twitter.com/aHsphHj0Up
— ANI (@ANI) April 28, 2023
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ విషసర్పం అని, చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. మరి కొద్ది రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారంలో భాగంగా కలబుర్గిలో ఖర్గే మాట్లాడారు. ఆ సమయంలోనే ఇలా నోరు జారారు.
"ప్రధాని నరేంద్ర మోదీ ఓ విషసర్పం లాంటి వాడు. అది విషమా కాదా అని రుచి చూశారా..? ఇక అంతే. ఆ విషం ఎక్కి వెంటనే చచ్చిపోతారు"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
బీజేపీ నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ప్రధాని మోదీ గురించి మాట్లాడలేదని, కేవలం బీజేపీ ఐడియాలజీ గురించి మాత్రమే కామెంట్ చేశానని అన్నారు. వాళ్ల ఐడియాలజీ విషపూరితమైన పాము లాంటిదని, ముట్టుకుంటే కాటుకు గురి కాక తప్పదని అన్నట్టు వివరించారు.
Also Read: Ayodhya Ram Temple: అయోధ్య రాముడు కొలువుదీరేది అప్పుడే, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ