Kabul Explosion: అఫ్గాన్‌లోని మసీదులో బాంబు పేలుడు, 20 మంది మృతి
Kabul Explosion: కాబూల్‌లోని ఓ మసీదులో జరిగిన బాంబు పేలుడులో 20 మంది పౌరులు మృతి చెందారు.

అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఓ మసీదు వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోగా...40 మంది గాయపడ్డారు. సాయంత్రం ప్రార్థనలు చేసుకునే సమయంలో ఖాయిర్ ఖానాలో బాంబు పేలింది. "కాబూల్‌కు ఉత్తర ప్రాంతంలోని ఓ మసీదులో బాంబు పేలిన ఘటనలో 20 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు" అని అఫ్గాన్ సెక్యూరిటీ సోర్స్ వెల్లడించింది. తాలిబన్లు అఫ్గాన్‌ను వశం చేసుకుని ఏడాది కావస్తున్నా...సాధారణ పౌరులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులనూ టార్గెట్ చేస్తూ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు.
At least 20 dead, 40 injured in mosque explosion in Kabul
— ANI Digital (@ani_digital) August 17, 2022
Read @ANI Story | https://t.co/MktOC8cbLQ#Kabul #blast #kabulmosque pic.twitter.com/TruQnzLZmO





















