KA Paul: పవన్ కల్యాణ్ మాతో పొత్తుకు వస్తే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తా - కేఏ పాల్
KA Paul Comments: విశాఖపట్నంలోని అసిల్ మెట్ట జంక్షన్ వద్ద ఉన్న తన కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు.
KA Paul Comments on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించామని.. ఆయన కనుక వస్తే ఏపీకి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సోమవారం (డిసెంబరు 25) విశాఖపట్నంలోని అసిల్ మెట్ట జంక్షన్ వద్ద ఉన్న తన కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీని తెలంగాణ నుంచి తరిమేశారని ఎద్దేవా చేశారు. ఆయనకు ఎక్కడా ఆదరణ లేదని అందుకే పవన్ కళ్యాణ్ తమతో పొత్తుకు రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత 14 ఏళ్లలో అవినీతి పాలన, ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యేక హోదా సాధించలేక పోయారని కేఏ పాల్ అన్నారు.
ఇంకా కేఏ పాల్ మాట్లాడుతూ.. చాలా మందికి ఇప్పటికీ మేర్రీ క్రిస్మస్ అంటే ఏమిటో అర్థం తెలియదని కేఏ పాల్ అన్నారు. యేసు క్రీస్తు మన పాపం కోసం చనిపోవడం మేరీ క్రిస్మస్ ని కేఏ పాల్ చెప్పారు. యేసు క్రీస్తు 33.5 ఏళ్లు ఈ లోకంలో జీవించారని అన్నారు. ‘‘యేసు క్రీస్తు తరువాత ఇటువంటి రక్షకుడు పుట్టలేదు. 200 దేశాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు వేల సంవత్సరాల తరువాత మళ్ళీ వస్తాను అని యేసు క్రీస్తు చెప్పారు’’ అని కేఏ పాల్ గుర్తు చేశారు. లోకం అంతా స్వార్థం, పాపం పెరిగిపోయిందని కేఏ పాల్ విచారం వ్యక్తం చేశారు.
ఈ క్రిస్మర్ రోజు నిరాశ్రయులైన వారికి వసతి కల్పిస్తాం, నిరుపేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేస్తాం. తన ఆధ్వర్యంలో జనవరి 30 న గ్లోబల్ పీస్ సమ్మిట్ హైదరాబాద్ లో జరుగుతుందని కేఏ పాల్ అన్నారు. ఇప్పటికే ప్రముఖులను ఆహ్వానించినట్లు కేఏ పాల్ చెప్పారు. ‘‘తెలంగాణ నుంచి జన సేనను తరిమేశారు. అటు చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో అవినీతి పాలన చేశారు. ప్రత్యేక ప్యాకేజీ, హోదా సాధించలేకపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవరి ఒకటో తేదీలోగా మాతో పొత్తుకి ముందుకు రావాలి. వస్తే సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటిస్తాం’’ అని కేఏ పాల్ అన్నారు.