JEE Mains 2022: జేఈఈ మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేస్కోవచ్చు!
JEE Mains 2022: జేఈఈ మెయిన్స్ 2022 రెండో విడత పరీక్షల హాల్ టికెట్లను జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేస్కోవచ్చని తెలిపింది.
JEE Mains 2022: జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) జేఈఈ మెయిన్స్ 2022 రెండో విడత పరీక్షలకు సంబంధించిన హాల్ టకెట్లను జులై 22వ తేదీన విడుదల చేసింది. అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేస్కోవాలనుకునే వాళ్లు jeemain.nta.nic.in 2022 వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాల్సి ఉంటుందని తెలిపింది. అయితే హాల్ టికెట్ డౌన్ లోడ్ కోసం అభ్యర్థులు.. అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా డౌన్ లోడ్ చేస్కున్న జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, వర్గం, రూల్ నెంబర్, పరీక్ష తేదీ, సమయం, ఫొటో, సంతంకం, పరీక్షా కేంద్రం వివరాలు ఉంటాయి.
హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేస్కోండిలా..
- ముందుగా జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ ఇవ్వాలి. keemain.nta.nicin 2022.
- ఆ తర్వాత JEE Main 2022 Admit Card Session 2 లింక్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత లాగిన్ చేసేందుకు కావాల్సిన వివరాలను ఎంటర్ చేసి లాగిన్ బటన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
- అటు తర్వాత JEE Main Session 2 Admit Card అని ఉన్న లింక్ పై క్లిక్ చేయాలి.
- అందులో అప్లికేషన్ నెంబర్ తోపాటు అభ్యర్థి పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేస్కోవాలి.
జేఈఈ మెయిన్స్ 2022 హాల్ టికెట్లు పొందే అధికారిక వెబ్ సైట్లు
- www.jeemain.nta.nic.in 2022
- jeemain.nta.nnic.in admit card 2022
- nta.ac.in
- examinationservices.nic.in
పేపర్ ప్యాటర్న్...
జేఈఈ మెయిన్ లో రెండు పేపర్లు ఉన్నాయి. పేపర్1, పేపర్ 2. పేపర్ 1 అనేది బి.ఈ, బీ-టెక్ చేసిన వారికి నిర్వహిస్తారు. అలాగే పేపర్ 2 మళ్లీ రెండుగా విభజిస్తారు. A పేపర్ బి.ఆర్క్ విద్యార్థులకు, B పేపర్ బి.ప్లానింగ్ చదివిని వారికి నిర్వహిస్తారు.
పరీక్షా తేదీలు..
జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జులై 21న మొదలై 30 తేదీన ముగియాల్సి ఉండగా.. జులై 25వ తేదీన ప్రారంభం అవుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం తెలిపింది. అయితే ఈ వాయిదాలకు గల కారణం మాత్రం చెప్పలేదు. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను జులై 25 నుంచి నిర్వహిస్తామని.. మొత్తం 517 కేంద్రాల్లో 6.29 లక్షల మంది విద్యార్థుల హాజరు కానున్నారు. అలాగే జేఈఈ మెయిన్స్ మొదటి వడత పరీక్షలను ఎన్టీఏ జూన్ 23వ తేదీ నుంచి 29 వరకు నిర్వహించింది. ఆ ఫలితాలను జులై 12న ప్రకటించింది.