By: Ram Manohar | Updated at : 17 Feb 2023 05:07 PM (IST)
జమ్ముకశ్మీర్‌లోని సదివర గ్రామ సర్పంచ్ ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గించేందుకు బంపర్ ఆఫర్ పెట్టాడు. (Image Credits: Pixabay)
Gold Coin for Polythene:
జమ్ముకశ్మీర్‌లో...
ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణం కలుషితమవుతోంది. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో సమస్యలు ఎదురవుతున్నాయి. చెరువులు, నదులు, సముద్రాల్లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. కొన్ని చోట్ల అయితే...ప్లాస్టిక్ బాటిళ్లను రోడ్లపైనే విసిరేస్తున్నారు. స్థానిక యంత్రాంగాలు ఎంత కట్టడి చేసినా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు కొందరు. ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త ఐడియాతో ముందుకొచ్చాడు జమ్ముకశ్మీర్‌లోని సదివర గ్రామ సర్పంచ్ ఫారూక్ అహ్మద్. పాలిథిన్ ఇవ్వండి గోల్డ్ కాయిన్ పట్టుకెళ్లండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలనును పడేయకుండా నేరుగా వచ్చి తనకే వాటిని ఇవ్వాలని చెప్పాడు. వాటికి బదులుగా బంగారు నాణేలు ఇస్తానని హామీ ఇచ్చాడు. "స్వచ్ఛతపై మనం శ్రద్ధ పెట్టకపోతే మరో పదేళ్లలో ఎక్కడా శుభ్రమైన నీరు కూడా దొరకదు" అంటున్నాడు ఫారూక్ అహ్మద్. ప్రభుత్వం తరపున స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తే...ప్రజలూ మారతారని చాలా ధీమాగా చెబుతున్నాడు. ఇప్పటికే దీనిపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ఎవరి ఇంట్లో వాళ్లే గార్బేజ్ పిట్‌లు తయారు చేసుకుని అందులోనే ప్లాస్టిక్ వ్యర్థాలు వేయాలని సూచించాడు. అయితే...ఈ ఐడియా పెద్దగా వర్కౌట్ అవలేదు. అలా గార్బేజ్ పిట్‌లలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా నేల సారం పోతోంది. అందుకే...కొత్తగా ఆలోచించి గోల్డ్ కాయిన్ ఐడియాతో ముందుకొచ్చాడు.
20 క్వింటాళ్ల పాలిథిన్‌కు..
20 క్వింటాళ్ల పాలిథిన్ పట్టుకొచ్చిన వాళ్లకు ఓ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాడు ఫారూక్ అహ్మద్. 20 క్వింటాళ్ల కన్నా తక్కువ తీసుకొచ్చినా వెండి నాణెం ఇచ్చి పంపుతున్నాడు. ఇలా ఏదో ఓ తాయిలాలు ఇచ్చి గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే స్థానిక యువత ఓ కమిటీ ఏర్పాటు చేసింది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కొత్త ఆలోచనలతో ముందుకొస్తోంది.
"ఏడాది కాలంలోనే మా గ్రామంలో చాలా మార్పులు వచ్చాయి. గతంలో రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించేవి. ఇప్పుడలా లేదు"
- యూత్ క్లబ్ వాలంటీర్
అనంత్‌నాగ్ గ్రామంలోనూ ఇదే ఐడియాను ఫాలో అవుతున్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇదే ఆలోచనను అనుసరిస్తామని సర్పంచ్‌లు చెబుతున్నారు.
ప్రమాదకరం..
ఒక వ్యక్తి జీవిత కాలంలో దాదాపు 44 పౌండ్ల ప్లాస్టిక్ తినేస్తున్నాడని థామస్ రూటర్స్ ఫౌండేషన్ అధ్యయనంలో వెల్లడించింది. ఇప్పుడు ప్రజలు క్రమేనా పర్యావరణం గురించి నెమ్మదిగా ఆలోచిస్తున్నారు. వనరులపై ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నారు. అయితే, ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగం పరిమితికి మించి ఉంది. నిజానికి మన కిచెన్స్ ప్లాస్టిక్ బాటిల్స్, జార్స్, కంటైనర్స్, గిన్నెల నుంచి గార్బేజ్ బ్యాగుల వరకు ఎన్నో వస్తువుల రూపంలో ప్లాస్టిక్ నిండి ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతి రోజు ఇండియాలో 6వేల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోందట. టితో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ నేరుగా ఎండ తగిలి వేడెక్కినపుడు అందులో డయాక్సిన్ అనే టాక్సిన్ ఉత్పత్తి అవుతుంది. ఈ నీళ్లు తాగుతూ పోతే కొంత కాలానికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
SSC CHSLE 2022 Key: ఎస్ఎస్సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఖాళీలు, అర్హతలివే!
నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?