By: Ram Manohar | Updated at : 17 Feb 2023 04:14 PM (IST)
అదాని కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Adani Hindenburg Case:
సీల్డ్‌కవర్‌లో పేర్లు..
అదాని హిండన్‌బర్గ్ కేసు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీ నియమించాలని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు SEBI కొందరి పేర్లను ప్రతిపాదించింది. SEBI తరపున వాదించే సోలిసిటర్ జనరల్ ఈ వివరాలు కోర్టుకి సమర్పించారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కమిటీకి లీడర్‌గా నియమించే నిర్ణయం కోర్టుదేనని తేల్చి చెప్పారు సోలిసిటర్ జనరల్. అయితే...SEBI ప్రతిపాదించిన పేర్ల జాబితాను సీల్డ్ కవర్‌లో అందించడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కమిటీలో సభ్యులు ఎవరు ఉండాలో కోర్టే నిర్ణయిస్తుందని, అలా అయితే తప్ప పారదర్శకత ఉండదని తేల్చి చెప్పింది.
"మేం ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను ఆమోదిస్తే అది ప్రభుత్వం నియమించిన కమిటీ అయిపోతుంది. ఈ కమిటీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలి"
-సుప్రీంకోర్టు ధర్మాసనం
SC hearing on Adani-Hindenburg row | CJI DY Chandrachud says that they'll not accept the sealed cover suggestion by the Centre because they (SC) want to maintain full transparency.
— ANI (@ANI) February 17, 2023
SC hearing on Adani-Hindenburg row | Supreme Court reserves order on the issue related to appointing the committee.
— ANI (@ANI) February 17, 2023
ప్రస్తుతం విధుల్లో ఉన్న సుప్రీంకోర్టు జడ్జ్ నేతృత్వంలో కమిటీని నియమించలేమని, ఆ బాధ్యతను మాజీ జడ్జ్‌కే అప్పగిస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం.
కేంద్రం వివరణ..
ఫిబ్రవరి 10 వ తేదీన సుప్రీం కోర్టు "ప్రత్యేక కమిటీ" నియమించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అంగీకరించిన కేంద్రం ఆ కమిటీలోని సభ్యుల పేర్లనూ కోర్టు ముందుంచింది. అయితే...ఇదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కమిటీ నియమించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ SEBI అన్ని విధాలుగా పారదర్శకంగా ఉందని తేల్చి చెప్పింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలతో ప్రస్తుత సమస్యని పరిష్కరించవచ్చని వెల్లడించింది. ప్యానెల్‌లో ఎవరెవరుంటారో వాళ్ల పేర్లను సీల్డ్‌కవర్ ద్వారా వెల్లడించేందుకు అనుమతించాలని సుప్రీం కోర్టుని కోరింది. కానీ...సర్వోన్నత న్యాయస్థానం అందుకు అంగీకరించడం లేదు.
అమిత్‌షా స్పందన..
వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, హిండెన్‌బర్గ్ నివేదికపై మన దేశంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ సమస్య గురించి మాట్లాడారు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లిందని తెలిపారు. ఇందులో బీజేపీకి దాపరికం లేదని, భయపడాల్సిన పని లేదని అన్నారు. సుప్రీం కోర్టులో ఈ అంశం ఉన్నందున, కేబినెట్ లో ఉన్న తాను ఈ సమయంలో ఈ అంశంపై ఏమీ మాట్లాడటం సరికాదని అమిత్ షా అన్నారు. ప్రతిపక్షాలకు విమర్శలు చేయడం మాత్రమే తెలుసని అమిత్ షా అన్నారు. తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని చెప్పారు.
Also Read: Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమా? కమిటీ ఏం చెప్పిందంటే!
5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ
Ukraine IMF Loan: యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌కు కాస్త ఊరట, లోన్ ఇచ్చేందుకు IMF అంగీకారం
Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల
RRB Group D Result: రైల్వే 'గ్రూప్-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?
Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్‌పై ఈడీ వివరణ కోరిన కోర్టు
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?
IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్