అన్వేషించండి

Jagtial News : మూగ జీవిని కాపాడబోయి కరెంట్ షాక్ తో యువకుడి మృతి

Jagtial News : జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తనకు జీవనాధరమైన మూగజీవి రక్షించపోయి ఓ యువకుడు ప్రాణాలు విడిచాడు.

Jagtial News : జగిత్యాల జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.  మూగజీవిని కాపాడబోయి యువకుడు మృత్యువాత పడ్డాడు.  జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ కు చెందిన తిరుపతి(17) హస్నాబాద్ లోని వ్యవసాయ భూమిలో ఆదివారం పశువులను మేతకు వదిలారు. ఆ సమయంలో ఒక గేదె పొలంలో మోటర్ సర్వీస్ వైర్ కి తాకి కరెంటు షాక్ తో విలవిలాడింది. ఇది గమనించిన తిరుపతి గేదెను కాపాడేయత్నంలో కరెంట్ షాక్ తో మృతి చెందాడు. తనకున్న 20 బర్రెలను మేపుకుంటూ జీవనోపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఒక్కగానొక్క  కొడుకు కరెంట్ షాక్ తో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ సంజీవ్ చేరుకుని విచారణ చేపట్టారు. 

రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి

ఊర కుక్కలు వెంబ‌డించ‌డంతో భయంతో గొర్రెలు పరుగులు పెట్టాయి. గొర్రెల మంద ఒక్కసారిగా గ్రామ శివారులోని రైలు ప‌ట్టాల‌పైకి వ‌చ్చాయి. అప్పుడే వేగంగా వ‌చ్చిన రైలు గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 335 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘ‌ట‌న దేవ‌ర‌క‌ద్ర మండ‌లం కౌకుంట్ల గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. కౌకుంట్లకు చెందిన పెద్ద మాసన్న, దూలన్న, తిరుపతయ్యకు చెందిన దాదాపు 500 గొర్రెల‌ను గురువారం రాత్రి గ్రామ రైతు వేదిక వద్ద నిలిపారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఊర కుక్కలు గొర్రెల మందపై దాడికి దిగాయి. భయంతో గొర్రెలు పరుగులు పెట్టాయి. గ్రామ శివారులో రైల్వే ట్రాక్‌ దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు గొర్రెల‌ను ఢీకొట్టింది.

రూ.33.50 లక్షలు నష్టం 

ఈ ప్రమాదంలో మాసన్నకు చెందిన‌ 160 గొర్రెలు, దూలన్నకు చెందిన 100 గొర్రెలు, తిరుపతయ్య 75 గొర్రెలు మొత్తం 335 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనపై స‌మాచారం అందుకున్న తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసులు, పశు వైద్యులు జీసన్‌అలీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రాణాలు కోల్పోయిన గొర్రెల విలువ సుమారు రూ.33.50 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు.

Also Read : Social Media Love : ప్రేమ కోసమై వలలో పడిన పల్నాడు పోరడు, తల్లిదండ్రులకు చెప్పకుండా!

Also Read : Hawala Money: హైదరాబాద్‌లో పోలీసుల తనిఖీలు - రూ.79.25 లక్షలు స్వాధీనం, 3 పబ్ లపై కేసులు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

మీ iPhone అసలైనదా లేక నకిలీదా? IMEI నంబర్ సహా ఈ పద్ధతుల్లో గుర్తించండి
మీ iPhone అసలైనదా లేక నకిలీదా? IMEI నంబర్ సహా ఈ పద్ధతుల్లో గుర్తించండి
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Essential Car Care Products: మీ కారు ఎప్పుడూ కొత్త దానిలా మెరిసిపోవాలా? అయితే మీ గ్యారేజీలో ఉండాల్సిన టాప్ 10 కార్ కేర్ ప్రొడక్ట్స్ ఇవే!
మీ కారు ఎప్పుడూ కొత్త దానిలా మెరిసిపోవాలా? అయితే మీ గ్యారేజీలో ఉండాల్సిన టాప్ 10 కార్ కేర్ ప్రొడక్ట్స్ ఇవే!
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో సీఎం చంద్రబాబు ప్రారంభం
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో సీఎం చంద్రబాబు ప్రారంభం
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Kriti Sanon : నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
MI vs KKR ముఖాముఖీ పోరులో పైచేయి ఎవరిది? వాంఖడేలో మ్యాచ్ అయినా ముంబైలో టెన్షన్
MI vs KKR ముఖాముఖీ పోరులో పైచేయి ఎవరిది? వాంఖడేలో మ్యాచ్ అయినా ముంబైలో టెన్షన్
Embed widget