అన్వేషించండి

Wayanad: నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధ పడ్డానో ఇప్పుడంత బాధ పడుతున్నా - వయనాడ్ విషాదంపై రాహుల్

Wayanad Landslides: వయనాడ్‌లో ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించారు. అక్కడి స్థితిగతులపై ఆరా తీశారు. బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు.

Wayanad News: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అండగా ఉండేందుకే వచ్చామని వెల్లడించారు. నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధ కలిగిందో ఇప్పుడూ అంతే బాధగా ఉందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. తానొక్కడినే కాదని, చాలా మంది ఇదే విధంగా ఆవేదన చెందుతున్నారని అన్నారు. వయనాడ్ విషాదం హృదయాన్ని కలిచి వేస్తోందని తెలిపారు. ఈ విషాదాన్ని చూస్తుంటే నోట మాట రావడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఇలాంటి ప్రమాదే జరిగిందని వివరించారు. ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదని తేల్చి చెప్పారు. దీన్ని కచ్చితంగా జాతీయ విపత్తుగా పరిగణించాలని రాహుల్ స్పష్టం చేశారు. 

"ఇదో తీరని విషాదం. కేవలం కేరళకే కాదు. దేశమంతా ఈ విపత్తుని చూసి ఆవేదన చెందుతోంది. ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకే వచ్చాను. చాలా మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. ఇళ్లనూ పోగొట్టుకున్నారు. వాళ్లందరినూ చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వీలైనంత వరకూ మా వంతు సాయం కచ్చితంగా అందిస్తాం. బాధితులకు పరిహారం అందించే దిశగా కృషి చేస్తాం. చాలా మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. బాధితులకు సాయం అందిస్తున్న వైద్యులు, నర్స్‌లు, వాలంటీర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

సాయం చేయడమే మా ప్రాధాన్యం..

ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదని రాహుల్ తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి బాధితులకు సాయం అందించడం మాత్రమే తమ కర్తవ్యం అని వెల్లడించారు. తక్షణమే సహాయక చర్యలు అందించాలని అన్నారు. నాన్న చనిపోయినప్పుడు ఎంతో బాధ పడ్డానని, ఇప్పుడు ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే అంతే బాధగా ఉందని అన్నారు. ఇక్కడి ప్రజలు చాలా మంది తమ సొంత వాళ్లను కోల్పోయి నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశమంతా వయనాడ్‌కి అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  ప్రియాంక గాంధీ కూడా ఈ విషాదంపై స్పందించారు. రోజంతా ప్రభావిత ప్రాంతాల్లోనే గడిపామని వెల్లడించిన ఆమె..బాధితులు ఎంత ఆవేదన చెందుతున్నారో అర్థం చేసుకోగలమని అన్నారు. వీలైనంత వరకూ వాళ్లకు సాయం చేసేందుకే ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. అటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇదే తరహా విషాదం జరిగిందని, ఇక్కడి బాధితులు ఏ విధంగా సాయం అందించగలమో ఆలోచిస్తున్నామని తెలిపారు. 

Also Read: Wayanad Landslides: వయనాడ్‌లో పర్యటించిన రాహుల్, ప్రియాంక - బాధితులకు పరామర్శ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
TGSPSC Notification: ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఉద్యోగాలకు టీజీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ 
ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఉద్యోగాలకు టీజీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ 
Indian Mango party San Francisco: అమెరికాలో ఫ్రీ మ్యాంగో ఫెస్టివల్ పెట్టిన భారతీయులు - క్యూలో నిలబడి తిన్న అమెరికన్లు - వీడియోలు వైరల్
అమెరికాలో ఫ్రీ మ్యాంగో ఫెస్టివల్ పెట్టిన భారతీయులు - క్యూలో నిలబడి తిన్న అమెరికన్లు - వీడియోలు వైరల్
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Embed widget