Petro Taxes : పెట్రో పన్నుల పాపం అంతా కేంద్రానిదేనా ? రాష్ట్రాల వాదనేంటి ? కేంద్రం చెబుతున్నదేంటి ?
పెట్రో పన్నుల పాపం కేంద్రానిదేనని..తమకేం సంబంధం లేదని కొన్ని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. కానీ పన్నులు పిండుకోవడంలో దొందూ దొందే. రాష్ట్రాలు కేంద్రాన్ని నిందించి తాము తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెట్రో పన్నుల అంశం చర్చనీయాంశం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ. ఐదు. రూ. పది తగ్గించి రాష్ట్రాలు కూడా తగ్గించాలని సూచించింది. చాలా రాష్ట్రాలు తమ ప్రజలపై భారం తగ్గించాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం అసలు పెంచింది కేంద్రం కాబట్టి తాము తగ్గించబోమని.. కేంద్రమే తగ్గించాలని వాదిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు పెట్రో పన్నులు పెంచింది ఎవరు..? రాష్ట్రాలకు ఆదాయం పెరగలేదా ? అసలు ఎంత పన్నులు వసూలు చేస్తున్నారు..? ఎవరికి ఆ పన్నుల ఆదాయం వెళ్తోందనేదానిపై సమగ్ర కథనం ఇది.
పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్రాల పన్నుల వసూలు !
పెట్రో ఉత్పత్తులపై కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా విడిగా పన్నులు వసూలు చేస్తుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోలు, మద్యం ఉత్పత్తుల్ని మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకు రాలేదు. ఈ కారణంగా అటు కేంద్రం ఎక్సైజ్ పన్ను వేస్తుంది. ఇటు రాష్ట్రం వ్యాట్ వసూలు చేస్తుంది. ఇక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం పెంచుకోవడానికి సెస్‌ల రూపంలో చాన్స్ ఎలాగూ ఉండనుంది. ఏపీలో రూ. నాలుగు అదనపు సెస్‌తో పాటు మరో రూపాయి రోడ్ సెస్ వసూలు చేస్తున్నారు. కేంద్రం కూడా ఈ సెస్ అధికంగా వసూలు చేస్తోంది. కేంద్రం సెస్ వసూలు చేయడానికి కారణం ఉంది. సెస్ వసూలు చేస్తే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన 41శాతం పన్నుల వాటాలో కలపకుండా ఉండవచ్చు. అయితే పన్నుల వసూలు వసూలే.. అది కేంద్రానికి వెళ్తుందా.. రాష్ట్రానికి వెళ్తుందా అన్నది తరవాత విషయం.
Also Read : లఖింపూర్ ఘటనలో ట్విస్ట్.. కాల్పులు జరిపింది ఆశిష్ మిశ్రానే.. ఇరకాటంలో కేంద్ర మంత్రి!
2020-21లో ప్రజల నుంచి కేంద్రం వసూలు చేసిన పెట్రో పన్నులు రూ. 4 లక్షల 53 వేల కోట్లు !
2014 తరువాత గత ఏడేళ్ల కాలంలో అంటే మోడీ సర్కార్ హయాంలో పెట్రోల్, డీజిల్‌పై భారీగా పన్నులు పెంచారు. దీనికి వారికి కాలం కలసి వచ్చింది. 2014లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 109 డాలర్లు ఉన్నప్పుడు, రిటైల్‌గా పెట్రోల్ ధర లీటర్ రూ.71 ఉండేది. ఆ తరవాత అంతర్జాతీయ పరిణామాల్లో బ్యాలెర్ ధర 30 డాలర్లకు కూడా పడిపోయింది. ఆ సమయంలో కేంద్రం రేట్లు ఏ మాత్రం తగ్గించి ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా .. ఎక్సైజ్ టాక్స్ లు పెంచుతూ ఆ నిధులను తన ఖాతాలో వేసుకోవడం ప్రారంభించింది. 2014లో డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం 8 శాతం ఉండగా, ఇప్పుడు అది 35శాతానికి పెరిగింది. 2013 -14లో పెట్రోల్, డీజిల్‌పై కేంద్రానికి వచ్చిన ఆదాయం కేవలం రూ.53వేల కోట్లు మాత్రమే. కానీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్రానికి వచ్చిన ఆదాయం ఏకంగా నాలుగు లక్షల కోట్లు ఎక్కువ. అంటే రూ. 4 లక్షల 53వేల 812 కోట్ల దేశ ప్రజల ఆదాయాన్ని పెట్రో పన్నుల రూపంలో కేంద్రం వసూలు చేస్తుందన్న మాట.
Once again, @YSJagan govt is misleading people of AP spreading falsehood as facts. Total revenue for state govts from petroleum sector is Rs. 2,21,056 crore and not 19,475 crore. (Reply in Rajya Sabha on July 28, 2021.) @YSRCParty must top lies and reduce VAT on Petrol, diesel. pic.twitter.com/JZQh8ju8Hf
— GVL Narasimha Rao (@GVLNRAO) November 7, 2021
Also Read: రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?
2020-21లో రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నులు రూ. 2 లక్షల 17వేల కోట్లు !
పైన చెప్పుకున్నది కేవలం కేంద్రం వసూలు చేసే పన్ను మాత్రమే. అన్ని రాష్ట్రాలు విడిగా వ్యాట్ వసూలు చేస్తాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు వసూలు చేసే పెట్రో పన్నులు రూ. 2 లక్షల 17వేల కోట్ల 650 కోట్లు. ఈ రెండు కలిపితే ప్రజలకు వచ్చే ఆదాయంలో రూ. ఆరు లక్షల 71వేల కోట్లు కేవలం పెట్రోల్ డీజిల్‌మీదనే కేంద్ర రాష్ట్రాలు వసూలు చేసుకుంటున్నాయన్నమాట. అంటో 130 కోట్ల మంది జనాభా ఉంటే సగటున ఒక్కొక్కరు కేవలం పెట్రో పన్నులే రూ. ఐదు వేల కన్నా ఎక్కువ కడుతున్నారన్నమాట. ఇక మనం కొనే ఉప్పులు, పప్పులన్నింటి మీద కట్టే జీఎస్టీ వేరు. అదీ కాక ఎవరైనా ఐదు లక్షల కన్నా ఎక్కువ సంపాదిస్తే ఆదాయపు పన్ను ఉంటుంది.. అది వేరే.
Also Read: ఎయిడెడ్ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?
రూపాయిల్లో తగ్గించి కనికట్టు చేసిన ప్రభుత్వాలు !
ఎక్సైజ్ పన్ను పర్సంటేజీని తగ్గించలేదు కేంద్ర ప్రభుత్వం. కేవలం రూ. ఐదు, రూ. పది మాత్రం తగ్గిస్తున్నట్లుగా ప్రకటించాయి. ఇతర ప్రభుత్వాలుకూడా అదే చేశాయి. అందుకే ఈ తగ్గింపు ఎంతో కాలం ఉండదని.. మరో నెల రోజుల్లోనో.. రెండు నెలల్లోనే తగ్గింపు అంతా కవర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మన దేశ ప్రజలు అల్ప సంతోషులు. తగ్గింది కదా అని సంతోషపడతారు. ఇప్పుడు అదే జరుగుతోంది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ.. ఎక్సైజ్ పన్ను శాతాన్ని తగ్గించడం లేదు. పెట్రోల్‌పై పన్నులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2014 స్థాయిలో ఉంచితే లీటర్ పెట్రోల్ కేవలం రూ.66 వస్తుంది. పెంచిన పన్నులు కేంద్ర రాష్ట్రాలు తగ్గిస్తే చాలు ప్రజలకు ఊరట లభిస్తుంది.
Also Read : కేంద్రంపై ఈ దూకుడు 14వ తేదీన చూపిస్తారా ? సదరన్ కౌన్సిల్ భే్టీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటవుతారా ?
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్నులే ఎక్కువ !
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రంతో సమానంగా పన్నులు వసూలు చేస్తున్నారు. వారు కూడా వ్యాట్ విధిస్తున్నారు.. అదనపు వ్యాట్.. సెస్ విధిస్తున్నారు. ఏ పేరుతో సెస్ వేస్తున్నారో... వాటికి పనులు చేయడం లేదు. అమరావతి, రోడ్ సెస్‌ల పేరుతో వసూలు చేస్తున్న దానికి ఏపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటోంది. ప్రస్తుతం కేంద్రం పెట్రోల్‌పై రూ. ఐదు, డీజిల్‌పై రూ. పది తగ్గించిన తర్వాత పన్నులు..కేంద్రం కన్నా రాష్ట్రం వసూలు చేసేదే ఎక్కువ అయింది. ప్రస్తుతం ఏపీలోఒక్క లీటర్ మీద .. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్, అదునపు వ్యాట్, సెస్ అంతా కలిసి రూ. 35 వరకు పన్నులు వసూలు చేస్తోంది. కానీ కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు రూ.30 లోపే ఉన్నాయి. తెలంగాణలోనూ కేంద్రం వసూలు చేస్తున్నదాని కన్నా రాష్ట్రం వసూలు చేస్తున్నదే ఎక్కువ.
YCP govt has published a false advertisement using public money, fooled them & maligned central government’s honest & good deeds.
— Sunil Deodhar (@Sunil_Deodhar) November 9, 2021
While neighbouring BJP-Ruled Karnataka & Puducherry reduced fuel prices, AP Govt remained adamantly insensitive towards people. pic.twitter.com/OZeDwndrQe
కేంద్రం పన్నుల పెంపుతో రాష్ట్రాలకూ పెరిగిన ఆదాయం...!
పన్నుు పెంచింది కేంద్రం కాబట్టి కేంద్రమే తగ్గించాలని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. కానీ కేంద్రం పన్నులు పెంచిన ప్రతీ సారి రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరిగింది. పెట్రోల్ రేటు యావరేజ్ గా ఒక 100 రూపాయలు ఉంటే అందులో రాష్ట్ర ప్రభుత్వం వేసే వ్యాట్ 31 శాతం అంటే 31 రూపాయలు టాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. అదనపు వ్యాట్ నాలుగు శాతం, రోడ్ సెస్ రూపాయి కూడా ఉన్నాయి. అంటే 36 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లతుంది. ఇప్పుడు పెట్రోల్ రేటు రూ. 115 ఉంది కాబట్టి.. అది నలభై వరకూఉంటుంది. కానీ పెట్రోల్ రేటు 70 రూపాయలు మాత్రమే ఉన్నప్పుడుర రాష్ట్ర ప్రభుత్వానికి లీటర్‌పై ఈ పన్నుల రూపంలో వచ్చేది కేవలం 25 లోపే. అంటే కేంద్రం రేట్లు పెంచి వంద దాటించడం వల్ల రాష్ట్రానికి కూడా లీటర్‌పై రూ. 15 చొప్పున పన్నుల ఆదాయం పెరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాచేసి రాజకీయం చేస్తున్నాయి. తప్పంతా కేంద్రందే అంటున్నాయి. తప్పు కేంద్రంది మాత్రమే కాదు...రాష్ట్రాలది కూడా..! కానీ ఇక్కడ కేంద్ర, రాష్ట్రాలను ఒకరికొకరు నిందించుకంటూ ప్రజలకు రాజకీయం చూపిస్తూ.. పన్నులు మాత్రం వసూలు చేసుకుంటూనే ఉన్నారు.
Also Read: పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకపోతే ప్రజలకే కాదు ప్రభుత్వానికీ నష్టమే..! ఎలాగో తెలుసా ?
గొడవంతా పన్నుల పంపకంలోనే ..!
రాజ్యాంగం ప్రకారం కేంద్ర పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ కేంద్రం రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా సెస్‌ల బాట పట్టింది. ఈ కారణంగా రాష్ట్రం వసూలు చేసే పన్నలు కాక కేంద్రం వసూలు చేస్తున్న పెట్రో పన్నుల్లో 41 శాతం ఇవ్వడం లేదని రాష్ట్రాలు గుస్సా అవుతున్నాయి. కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. ఈ పంపకాల మధ్యే ఇప్పుడు అసలు రాజకీయ పంచాయతీ జరుగుతోంది.
Also Read: ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?