By: ABP Desam | Updated at : 10 Nov 2021 12:03 PM (IST)
కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఘటన కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలక నిజాలు బహిర్గతం చేసింది. అక్టోబర్ 3న జరిపిన జరిగిన దారుణ ఘటనలో కాల్పులు జరిపింది కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రానే అని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను కేసు నుంచి తప్పించాలని యత్నిస్తుండగా.. ఆయనకు వ్యతిరేకంగా కీలక సాక్ష్యాలు వెలుగుచూశాయి.
గత నెలలో రైతులపై ఎస్‌యూవీ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు అన్నదాతలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో కాల్పులు సైతం జరగడంతో కేసు మరింత సీరియస్ అయింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా యూపీలోని లఖింపూర్ ఖేరిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై నుంచి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనాలు దూసుకెళ్లాయి. మొదట కొన్ని రోజులు పరారీలో ఉన్న ఆశిష్ మిశ్రా ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. అంతకుముందే కొందరు నిందితులను యూపీ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
Also Read: సెకండ్ జనరేషన్ కరోనా వ్యాక్సిన్లు వస్తే ప్రయోజనం.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ కీలక వ్యాఖ్యలు
ఆశిష్ మిశ్రాతో మరో నిందితుడు అంకిత్ దాస్‌ల తుపాకులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి టెస్ట్ చేయగా అసలు విషయం వెలుగుచూసింది. ఆ సమయంలో దూసుకొచ్చిన బుల్లెట్లు ఆశిష్ మిశ్రా తుపాకీ నుంచే వచ్చాయని రిపోర్టులో తేలడంతో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఇరకాటంలో పడ్డారు. అంకిత్ దాస్‌తో పాటు లతిఫ్ గన్ సైతం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. లైసెన్స్ ఉన్న తుపాకుల నుంచి కాల్పులు జరిపిన అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. బుల్లెట్లు ఎవరినీ గాయపరచలేదు, కానీ వాహనంపై బుల్లెట్ గుర్తులు గమనించి పోలీసులు విచారణ నిమిత్తం నిందితుల వద్ద నుంచి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?
అసలేం జరిగిందంటే..
నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసన కార్యక్రమంలో కొందరు రైతులు పాల్గొన్నారు. అనంతరం రైతులు తిరిగి వెళ్తుండగా లఖింపూర్ కేరీలోని తికూనియాలో వారిపై నుంచి ఓ ఎస్‌యూవీ వాహనం దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వాహనం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాదని.. ఘటన జరిగిన సమయంలో ఆ కాన్వాయ్‌లో ఆయన తనయుడు ఆశిష్ మిశ్రా ఉన్నారని రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతుల హత్యాకాండ అనంతరం ఆశిష్ మిశ్రా పరారయ్యారు. కొన్ని రోజులకు పోలీసుల ఎదుట లొంగిపోగా దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల తుపాకీలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా కాల్పులు జరిపింది ఆశిష్ మిశ్రా అని తేలింది. దీంతో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది.
Also Read: ఎయిడెడ్ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
Rupee Memes : తగ్గిపోతున్న రూపాయి విలువ - సోషల్ మీడియా మీమ్స్ చూస్తే ఆ కోపాన్ని మర్చిపోతారు
LICIPO Memes : ఎల్ఐసీ షేర్లపై అతిగా ఆశలు పెట్టుకున్న వారికి షాక్ - ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి
Chitrakoot Temple: చారిత్రక ఆలయంలో విగ్రహాల చోరీ - పీడకలలు రావడంతో దొంగల ముఠా ఏం చేసిందంటే !
Gyanvapi Mosque Case: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
MI vs SRH, Match Highlights: రమణను నమ్మని డేవిడ్ - సన్‌రైజర్స్‌ను గెలిపించిన ఆ రనౌట్!
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్