X

Covid-19 Vaccines: సెకండ్ జనరేషన్ కరోనా వ్యాక్సిన్లు వస్తే ప్రయోజనం.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ కీలక వ్యాఖ్యలు

కొవిడ్19 వ్యాక్సిన్లలో ఇప్పటివరకు వినియోగించిన వ్యాక్సిన్లకు భిన్నంగా సెకండ్ జనరేషన్ టీకాలు రావాలన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్.

FOLLOW US: 

Covid-19 Vaccines: కరోనా వ్యాక్సిన్లలో భారీ మార్పులు రావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఆకాంక్షించారు. నాజల్ స్ప్రే, నోటి ద్వారా తీసుకునే మెడిసిన్ లాంటి సెకండ్ జనరేషన్ కరోనా వ్యాక్సిన్ల ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. కొవిడ్19 వ్యాక్సిన్లలో ఇప్పటివరకు వినియోగించిన వ్యాక్సిన్లకు భిన్నంగా సెకండ్ జనరేషన్ టీకాలు రావాలన్నారు.

వైద్యులు, ఆరోగ్య సిబ్బంది వద్దకు వెళ్లకుండానే తాము కొనుగోలు చేసిన కరోనా ఔషధాలను బాధితులు స్వయంగా తీసుకునే విధంగా ఉంటే అధిక ప్రయోజనమని చెప్పారు. ఇంజెక్షన్ల మాదిరిగా వ్యాక్సిన్లు రూపొందిస్తే వాటిని ఇవ్వడానికి అధిక సమయం పడుతుందని, అంతకుమించి చాలా జాగ్రత్తగా వాటిని పంపిణీ చేయాల్సి వస్తుందన్నారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏ వ్యాక్సిన్ కూడా 100 శాతం ఫలితాలు ఇవ్వలేదని గుర్తుంచుకోవాలన్నారు. 90 శాతం ఫలితాలు ఇచ్చేవి మెరుగైన, సమర్థవంతమైన వ్యాక్సిన్లుగా పేర్కొన్నారు.
Also Read: జుట్టురాలిపోకుండా ఒత్తుగా పెరగాలా... చక్కటి పరిష్కారం విటమిన్ ఇ

ప్రస్తుతం 129 రకాల కొత్త రకం వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని, మనుషులపై త్వరలోనే ప్రయోగించి మార్కెట్లోకి వచ్చేందుకు శ్రమిస్తున్నారని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. మరో 194 రకాల కరోనా వ్యాక్సిన్లు ల్యాబోరేటరీలలో పరీక్షల దశలో ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో సోషల్ మీడియా ద్వారా ఈ విషయాలు వెల్లడించారు. ఈ కొత్త వ్యాక్సిన్లు కొన్ని రకాల టీకాలు కచ్చితంగా అందరికీ ప్రయోజనకరంగా ఉంటాయని, ఇంజెక్షన్ల కంటే వేగంగా బాధితులు తీసుకునేలా తయారవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా 725 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని తెలుస్తోంది. ఇందులో భారత్‌లో 110 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ కావడం విశేషం.
Also read: సముద్రపు చేపలే ఆరోగ్యానికి మంచివంటున్న అధ్యయనాలు... తింటే ఎన్ని లాభాలో

తక్కువ సమయంలో ఎక్కువ మందికి పంపిణీ చేయడం, కరోనాపై మెరుగైన ప్రభావం చూపడం లాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యాక్సిన్లు పంపిణీ మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ల విషయంలో విజయం సాధించకపోయినా భవిష్యత్తులో తయారుచేసే టీకాలలో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. నాజల్ స్ప్రే రకం వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. ఇది కరోనా వైరస్‌ను ఊపిరితిత్తులపై ప్రభావం చూపకముందే కరోనాను తరిమికొడుతుందని చెప్పారు.
Also read: మనసు స్థిరంగా లేదా, ఆందోళనగా అనిపిస్తోందా... వీటిని తినండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: coronavirus covid19 COVID-19 WHO Covid Vaccine Soumya Swaminathan WHO Chief Scientist

సంబంధిత కథనాలు

Omicron Variant Scare: దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికులు.. ఇద్దరికి పాజిటివ్.. వారిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా?

Omicron Variant Scare: దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికులు.. ఇద్దరికి పాజిటివ్.. వారిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా?

Omicron Modi Review : ఆఫ్రికా విమానాలపై ఆంక్షల యోచన.. ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రధాని మోడీ సమీక్ష !

Omicron Modi Review :  ఆఫ్రికా విమానాలపై ఆంక్షల యోచన.. ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రధాని మోడీ సమీక్ష !

Omicron : " ఒమిక్రాన్‌" వేరియంట్ ఆందోళన కలిగించేదేనన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆఫ్రికా వాసుల రాకపోకలపై అనేక దేశాల ఆంక్షలు !

Omicron :

New Corona : దక్షిణాఫ్రికా నుంచి కొత్త కరోనా వైరస్ ముప్పు.. దేశంలో హై అలర్ట్ !

New Corona :  దక్షిణాఫ్రికా నుంచి కొత్త కరోనా వైరస్ ముప్పు.. దేశంలో హై అలర్ట్ !

New COVID-19 Variant: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్.. ప్రపంచంపై ఎందుకీ పగ!

New COVID-19 Variant: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్.. ప్రపంచంపై ఎందుకీ పగ!

టాప్ స్టోరీస్

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!