PM Modi wearing earring: చెవిపోగుతో మోదీ - కానీ అది స్టైలింగ్ కాదు- ఎమిటో తెలుసా?
Modi earring: ప్రధాని మోదీ ఇటీవల విదేశీ పర్యటనల్లో చెవిపోగుతో కనిపించడం హాట్ టాపిక్ అయింది. ఆయన కొత్త స్టైల్ ట్రై చేస్తున్నారని చాలా మంది అనుకున్నారు. కానీ నిజం వేరు.

Is PM Modi wearing an earring: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఒమన్ పర్యటనలో ఆయన చెవికి ఒక చిన్న ఆభరణం లాంటి వస్తువు కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అది మోదీ కొత్త స్టైల్ అని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే, దీని వెనుక అసలు కారణం ఫ్యాషన్ కాదు, అత్యాధునిక సాంకేతికత.
చెవిపోగు కాదు.. అది ‘రియల్ టైమ్ ట్రాన్స్‌లేటర్’
ప్రధాని మోదీ ఒమన్ ఉప ప్రధానమంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్‌ను కలిసినప్పుడు ఆయన కుడి చెవికి ఒక మెరిసే పరికరం కనిపించింది. అది ఆభరణం కాదు, అది ఒక రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ ఇయర్‌పీస్ (Real-time Translation Device). అంతర్జాతీయ దౌత్య సమావేశాల్లో ఇతర దేశాధినేతలు మాట్లాడే పరాయి భాషను వెంటనే అర్థం చేసుకోవడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు.
అరబిక్ నుండి ఇంగ్లీష్/హిందీకి అనువాదం
ఒమన్ అధికార భాష అరబిక్. దౌత్యవేత్తలు లేదా అక్కడి నేతలు అరబిక్‌లో మాట్లాడినప్పుడు, ఆ మాటలను వెంటనే ప్రధానికి అర్థమయ్యే భాషలోకి అంటే హిందీ లేదా ఇంగ్లీష్ ఈ పరికరం అనువదించి వినిపిస్తుంది. దీనివల్ల మధ్యలో అనువాదకులు లేకపోయినా సంభాషణలు ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగుతాయి.
ప్రధాని మోదీ ఎప్పుడూ తన స్టైలింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన ధరించే కుర్తాలు, కోట్లు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతుంటాయి. ఈ క్రమంలోనే ఈ ట్రాన్స్‌లేషన్ పరికరం కూడా చెవిపోగులా కనిపించేలా డిజైన్ చేసి ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో ఇటువంటి పరికరాలు పెద్దవిగా ఉండేవి, కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో ఇవి చాలా చిన్నవిగా, ఆభరణాల తరహాలో వస్తున్నాయి.
Landed in Muscat, Oman. This is a land of enduring friendship and deep historical connections with India. This visit offers an opportunity to explore new avenues of collaboration and add fresh momentum to our partnership. pic.twitter.com/RKZ5d8M1Jf
— Narendra Modi (@narendramodi) December 17, 2025
ఈ పర్యటనలో మోదీకి ఒమన్ దేశపు అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ఒమన్' (Order of Oman) లభించింది. అలాగే భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) పై కూడా కీలక చర్చలు జరిగాయి. ఇలాంటి ముఖ్యమైన చర్చల సమయంలో భాషా పరమైన అడ్డంకులు లేకుండా ఈ ఇయర్ డివైజ్ కీలక పాత్ర పోషించింది. మొత్తానికి, సోషల్ మీడియాలో వచ్చిన 'చెవిపోగు' వార్తల్లో నిజం లేదని, అది కేవలం దౌత్యపరమైన కమ్యూనికేషన్ కోసం వాడిన అత్యాధునిక పరికరమని స్పష్టమైంది.





















