Messi Visits Vantara: వంతారాను సందర్శించిన లియోనెల్ మెస్సీ.. అదొక అద్భుతం, గ్రేట్ జాబ్ అని ప్రశంసలు
Messi Praises Vantara | ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ వంతారా సంరక్షణ కేంద్రంలో పెద్ద పులులు, సింహాలు, ఏనుగులు వంటి జంతువులను సందర్శించాడు. ఓ ఏనుగు ఫుట్‌బాట్ ఆడటం చూసి షాకయ్యాడు.

గ్లోబల్ ఫుట్‌బాల్ ఐకాన్, అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ భారతదేశ పర్యటనలో భాగంగా గుజరాత్ జామ్ నగర్‌లోని వంతారా జంతు సంక్షేమ, సంరక్షణ కేంద్రాన్ని ఇటీవల సందర్శించారు. ఈ సందర్శన భారతదేశ సాంస్కృతిక, సంప్రదాయాలు, ప్రకృతితో జీవనతత్వం అనే విషయాలను ప్రపంచానికి అందించింది. స్టేడియాలు, మీడియా గ్లేర్ నుంచి దూరంగా మెస్సీ, అతడితో పాటు వచ్చిన సహచర ఫుట్‌బాల్ ప్లేయర్లు సాంస్కృతిక, జంతు సంక్షేమంతో నిమగ్నం కావడాన్ని ఎంజాయ్ చేశారు. భారత సమాజంలో లోతుగా ప్రతిధ్వనించే విలువలను మెస్సీ వంతారా పర్యటన హైలైట్ చేసింది.
భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాలతో మమేకం
వంతారాలో గడిపిన సమయంలో మెస్సీ ప్రశాంతమైన ఆలయాలు, సహజ పరిసరాల మధ్య, పూజ, ధ్యానంతో సహా భారతీయ ఆధ్యాత్మిక పద్ధతులను పరిచయం చేసుకున్నాడు. ఈ క్షణాలు అతను సాధారణంగా ఎదుర్కొనే, వేగవంతమైన వృత్తిపరమైన వాతావరణానికి విరుద్ధంగా ఉన్నాయి. కానీ ఆ క్షణాలను మెస్సీ ఆస్వాదించడంతో పాటు వంతారాలో చేస్తున్న కార్యక్రమాలను, జంతువుల పట్ల అనంత్ అంబానీ తీసుకున్న బాధ్యతను ప్రశంసించాడు.

ఈ ఆచారాల వెనుక ఉన్న సరళత, ఉద్దేశ్యం బలమైన ముద్ర వేసినట్లు పరిశీలకులు గమనించారు. ఇది సమతుల్యత, మైండ్‌ఫుల్‌నెస్, భారతదేశం ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. రోజువారీ జీవితాన్ని తీర్చిదిద్దడంలో సాంస్కృతిక సంప్రదాయాలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో వారికి ఈ అనుభవం గుర్తుచేసింది.
వంతారా రెస్క్యూ & కేర్ ప్రపంచంలోకి
సాంస్కృతిక నిమగ్నతకు మించి, ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ, అతడి సహచరులు వంతారాలో ఉన్న జంతువులతో సరదాగా సమయం గడిపారు. వంతారా అనేది జంతువుల రెస్క్యూ, పునరావాసం, జీవితకాల సంరక్షణపై దృష్టి పెడుతుంది. వివిధ రకాల జాతుల జంతువులకు ఇది నిలయంగా మారింది. జంతువుల సంరక్షణ దినచర్యలను దగ్గరగా గమనించాడు. 
సంరక్షకులు, వెటర్నరీ సిబ్బందితో మెస్సీ మాట్లాడాడు. జంతువుల సంక్షేమంలో ఉన్న ఓపిక, క్రమశిక్షణను కళ్లారా చూశాడు. ఈ సందర్శన మానవులు, జంతువుల మధ్య ఉండే బంధాన్ని.. భౌగోళిక, సంస్కృతిని అధిగమించే వాటి పట్ల జాలి, ప్రేమను హైలైట్ చేసింది.
ఫుట్‌బాల్‌పై అభిమానం ఉన్న ఏనుగు మణికలాల్‌తో ఊహించని విధంగా ఇంటరాక్ట్ అయ్యాడు. మెస్సీకి ఇది వంతారాలో అత్యంత గుర్తుండిపోయే క్షణాలలో ఒకటి. మెస్సీ ఓ ఏనుగు కోసం ఫుట్‌బాల్‌ను తన్నాడు, అది ఉత్సాహంగా స్పందించి ఆ ఫుట్‌బాల్‌తో ఆడుకోసాగింది. ఇది గమనించి మెస్సీ ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేశాడు. ఆ ఏనుగు మెస్సీ దృష్టిని ఆకర్షించింది. దాని చురుకుదనం చూసి మెస్సీ ఆశ్చర్యపోయాడు.
వంతారాలో ఉన్న జంతువుల ప్రదర్శన కంటే, ఎన్నో విలువైన క్షణాలను ఆస్వాదించాడు. మెస్సీ నిరాడంబరమైన స్వభావం ప్రత్యేకంగా నిలిచింది. ఎన్నో ఈవెంట్లతో తీరిక లేకుండా గడిపే ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ వంతారా కోసం తన విలువైన సమయాన్ని కేటాయించడంతో పాటు దాని ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారు. భారతదేశ సంప్రదాయం, ప్రకృతితో మమేకం కావడం, అన్ని జీవుల పట్ల కరుణ మన విలువలను నిశ్శబ్దంగా ప్రతిబింబించేలా చేసింది.






















