Iran-India Relations: ఇరాన్ భారత్ మైత్రిని బలపరిచిన ఇబ్రహీం రైసీ, ఆయన హయాంలోనే కీలక ఒప్పందాలు
Ebrahim Raisi: ఇబ్రహీం రైసీ హయాంలో భారత్ ఇరాన్ మధ్య మైత్రి బలపడిందని ప్రధాని మోదీ చెప్పడం వెనక కొన్ని కారణాలున్నాయి.
India Iran Relations: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో భారత్, ఇరాన్ మధ్య మైత్రిని బలపర్చడంలో రైసీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. అటు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా విచారం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ప్రధాని మోదీ ప్రస్తావించినట్టుగానే ఇబ్రహీం రైసీ హయాంలో రెండు దేశాల మధ్య మైత్రి బలపడింది. భారత్‌తో ఎప్పుడూ సత్సంబంధాలు కొనసాగించేందుకే ఆసక్తి చూపించారు రైసీ. 2021 వరకూ ఇరాన్ అధ్యక్షుడిగా హసన్ రౌహానీ ఉన్నారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీం రైసీ విజయం సాధించారు. విదేశాంగ మంత్రిగా అమిర్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరూ భారత్‌కి మిత్రులే. ఇరాన్‌లో భారత్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిందంటే అందుకు కారణం వీళ్ల చొరవే. ముఖ్యంగా ఇరాన్‌లోని Chabahar Portపై భారత్ పెట్టుబడులు పెట్టింది. దాని వెనక ఓ కారణం ఉంది. పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్ట్‌కి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది చాబహార్ పోర్ట్. గ్వాదర్ పోర్ట్ కోసం చైనా గట్టిగానే పెట్టుబడులు పెట్టింది. రష్యాతో అనుసంధానించే చాబహార్ పోర్ట్ భారత్‌కి వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. అందులోనూ గ్వాదర్ పోర్ట్‌కి దగ్గర్లో ఉండడం వల్ల చైనా, పాకిస్థాన్‌కి కౌంటర్‌గా చాబహార్ పోర్ట్‌పై ఫోకస్ పెట్టింది.
At Tehran, Iran today, delighted to be part of the signing of the Long Term Bilateral Contract on Chabahar Port Operations in presence of HE Mehrdad Bazrpash, Minister of Roads & Urban Development, Iran.
— Sarbananda Sonowal (Modi Ka Parivar) (@sarbanandsonwal) May 13, 2024
India will develop and operate Iran's strategic Chabahar Port for 10… pic.twitter.com/iXwekIk8ey
ఈ ఏడాది జనవరిలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇరాన్‌లో పర్యటించారు. ఆ సమయంలోనే భారత్ ఇరాన్ మధ్య Chabahar Port Deal కుదిరింది. దీంతో పాటు నార్త్-సౌత్ కారిడార్ అభివృద్ధికీ ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇరు దేశాలు. గత వారమే షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ ఈ డీల్‌పై సంతకం చేశారు. వచ్చే పదేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగేలా డీల్ కుదిరింది. ఇరాన్‌కి భారత్ మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చింది. BRICS లో ఇరాన్‌ని చేర్చాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో సౌతాఫ్రికాలో జరిగిన BRICS summitలో ఇరాన్‌ని కూడా అధికారికంగా చేర్చుకున్నారు. అందుకు కృతజ్ఞతగా భారత్ కలలు కంటున్న Global South కి ఇరాన్ మద్దతునిస్తోంది. ఇలా రెండు దేశాలు పరస్పరం సహకరించుకోడానికి రైసీ చాలా చొరవ చూపించారు.
Also Read: Paresh Rawal: ఓటు వేయకపోతే ట్యాక్స్ భారీగా పెంచాలి, కఠిన శిక్ష వేయాలి - పరేశ్ రావల్ సంచలన వ్యాఖ్యలు