అన్వేషించండి

రాముడి భక్తులకు మాత్రమే ఆహ్వానం పంపాం, అయోధ్య ఇన్విటేషన్‌ల వివాదంపై ప్రధాన పూజారి

Ayodhya Invitations: అయోధ్య ఇన్విటేషన్‌ల వివాదంపై పూజారి సత్యేంద్ర దాస్‌ క్లారిటీ ఇచ్చారు.

Ayodhya Ram Mandir Invitations: 

అయోధ్య ఆహ్వానాలపై..

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి (Ayodhya Ram Mandir Opening) అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే వేలాది మందికి ఆహ్వానం అందింది. అయితే...ఈ ఇన్విటేషన్‌ల విషయంలో కాస్త రాజకీయ రగడ కొనసాగుతోంది. కొంతమంది కీలక నేతలు తమకు ఆహ్వానం అందలేదని అసహనంతో ఉన్నారు. UBT శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇన్విటేషన్ పంపలేదని చెప్పారు. ఈ వివాదంపైనే  Shri Ram Janmabhoomi Temple ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. కేవలం రాముడి భక్తులకు మాత్రమే ఇన్విటేషన్‌లు పంపామని తేల్చి చెప్పారు. రాముడి పేరు చెప్పుకుని బీజేపీ రాజకీయాలు చేస్తుందన్న విమర్శల్నీ కొట్టిపారేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా ఆయనను గౌరవిస్తున్నారని అన్నారు. 

"అయోధ్య ఉత్సవానికి కేవలం రాముడి భక్తులకు మాత్రమే ఆహ్వానం పంపాం. రాముడి పేరు చెప్పుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందనడంలో ఎలాంటి అర్థం లేదు. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా గౌరవం లభిస్తోంది. ఇన్నేళ్ల హయాంలో ఆయన ఎన్నో గొప్ప పనులు చేశారు. ఇది రాజకీయం చేయాల్సిన విషయం కాదు. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం అని గుర్తుంచుకోవాలి"

- ఆచార్య సత్యేంద్ర దాస్, అయోధ్య రామ మందిర పూజారి

థాక్రేపై ఫైర్..

అంతకు ముందు ఉద్ధవ్ థాక్రే బీజేపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాముడి పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని మండి పడ్డారు. మందిర ఉత్సవాన్ని కేవలం ఓ పార్టీకే పరిమితం చేయడమేంటని ప్రశ్నించారు. ఏదేమైనా అయోధ్య రాముడి కోసం మందిరం కట్టడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అయితే...ఆయనకు ఆహ్వానం అందలేదన్న విమర్శలపై మండి పడ్డారు సత్యేంద్ర దాస్. 

"రాముడి పేరు చెప్పుకుని ఒకప్పుడు వాళ్లూ రాజకీయాలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ విషయం బహుశా ఉద్ధవ్ థాక్రే మర్చిపోయారేమో. రాముడిని నమ్ముకున్న వాళ్లే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అయినా ఇలాంటి వాళ్ల మాటలు పట్టించుకోనవసరం లేదు"

-  ఆచార్య సత్యేంద్ర దాస్, అయోధ్య రామ మందిర పూజారి

అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్ పేరు చెప్పి కొందరు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. ఎలాంటి అప్రూవల్ లేకుండానే కొందరు QR Codeల ద్వారా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్రహోం శాఖకూ ఫిర్యాదులు అందించింది. ఆ వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. X లో అధికారికంగా ఓ పోస్ట్ పెట్టింది. విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ అందరినీ అలెర్ట్ చేశారు. అలాంటి మాయగాళ్ల వలలో చిక్కుకోవద్దని సూచించారు.

Also Read: ISRO XPoSat Mission: కొత్త ఏడాది తొలి రోజే అద్భుతం చేసిన ఇస్రో- విజయవంతంగా ఎక్స్‌పోశాట్ ప్రయోగం

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget